Milk Price Hike: వినియోగదారులకు బిగ్ షాక్.. భారీగా పెరుగనున్న పాల ధరలు.. ఏకంగా రూ.6 పెంపు!
పాల (Milk Price Hike)సేకరణ వ్యయం పెరగడంతో పలు సంస్థలు లీటర్ పాల ధరలను రూ. 2 నుంచి రూ. 6 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
- V Santhosh Kumar
- Published on- November 11, 2026 / 03:25 PM IST
Mother dairy and amul hikes milk prices by up to rs 6 per litre
Milk Price Hike: సామాన్య ప్రజలకు నిత్యావసరమైన పాల ధరలు మళ్ళీ భగ్గుమన్నాయి. ప్రముఖ డెయిరీ దిగ్గజాలు మదర్ డెయిరీ, అముల్ సంస్థలు తమ వినియోగదారులకు షాక్ ఇస్తూ లీటర్ పాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. పెంచిన ఈ కొత్త ధరలు గురువారం నుంచే అమలులోకి రానున్నాయి. రైతుల నుంచి పాల సేకరణ వ్యయం గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని, ఆ భారాన్ని కస్టమర్లపై వేయక తప్పడం లేదని డెయిరీ సంస్థలు తెలిపాయి. లీటరుపై రకాన్ని బట్టి రూ. 2 నుంచి రూ. 6 వరకు పెరిగింది.
ఫుల్ క్రీమ్ మిల్క్‌పై రూ. 4 పెంపు.. పౌచ్ లీటరుకు ఏకంగా రూ. 76:
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రోజుకు సుమారు 35 లక్షల లీటర్ల పాలను సరఫరా చేసే మదర్ డెయిరీ, తాజాగా ప్రకటించిన సవరణ ప్రకారం ఫుల్ క్రీమ్ మిల్క్(Milk Price Hike) లీటరుపై రూ. 4 పెంచింది. దీంతో గతంలో రూ. 72 ఉన్న ఫుల్ క్రీమ్ పాల ధర ఇప్పుడు రూ. 76కు చేరుకుంది. అలాగే టోన్డ్ మిల్క్ ధర రూ. 58 నుంచి రూ. 60కి, టోన్డ్ మిల్క్ పౌచ్ ధర రూ. 62కి, డబుల్ టోన్డ్ మిల్క్ లీటరు ధర రూ. 56కి చేరింది.
నిత్యావసరాల ధరలతో ప్రజలపై అదనపు భారం.. మే 2026 తర్వాత మళ్లీ పెరుగుదల:
గతంలో మే 14, 2026లో మదర్ డెయిరీ తమ పాల ధరలను సవరించగా, తాజాగా పెరిగిన ధరలు సగటు కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. కేవలం పాలు మాత్రమే కాకుండా పాల ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ నిర్ణయం గట్టి పడేలా మారింది. ప్రతిరోజూ ఉదయమే అవసరమయ్యే పాల ధరలు పెరగడంపై సామాన్యుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
