ట్రిపుల్ కెమెరాలే ఎట్రాక్షన్ : Moto G8 Plus వచ్చేసింది.. ధర ఎంతంటే?

  • Publish Date - October 26, 2019 / 01:55 PM IST

లెనొవో కంపెనీకి చెందిన మోటరోలా బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయింది. అదే.. Moto G8 Plus స్మార్ట్ ఫోన్. ఈ కొత్త ఫోన్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో అక్టోబర్ 29 నుంచి సేల్ ప్రారంభం కానుంది. మిడ్ సిగ్మంట్ కింద కంపెనీ ఆఫర్ చేస్తున్న ఈ మోటో జీ8 ప్లస్ ఫోన్ ధర రూ.13వేల 999నుంచి లభ్యం కానుంది. ఇందులో ఫీచర్ల విషయానికి వస్తే.. 6.3 అంగుళాల IPS LCD మ్యాక్స్ విజన్ డిస్ ప్లే ఉంది. (అస్పెక్ట్ రేషియో 19;9). ఫుల్ హెచ్ డీ రెజుల్యుషన్ 1080×2340 ఫిక్సల్స్ తో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. 

క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 665 SoCతో పాటు 4GB ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. గ్రాఫిక్స్ లో అడ్రినో 610 GPU ఉండటం విశేషం. ఆన్ బోర్డు స్టోరేజీతో ఈ డివైజ్ 64GB వరకు సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డు స్లాట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ పై వెర్షన్ 9.0పై ఈ డివైజ్ రన్ అవుతుంది. కెమెరాల్లో 48MP ప్రైమరీ సెన్సార్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ స్పెషల్ ఎట్రాక్షన్. సెకండరీ యూనిట్ 16MP వైడ్ యాంగిల్ కెమెరా ఉండగా, మూడోది 5MP లెన్స్ డెప్త్ సెన్సార్ ఉంది. 

LED ఫ్లాష్ కెమెరాలకు మరింత ఎఫెక్టీవ్ గా కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్ కు ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ కూడా ఉంది. 4,000mAh బ్యాటరీ సామర్థ్యంతో 15W టర్బో పవర్ 2 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదనపు ఫీచర్లలో నెట్ కనెక్టవిటీ చేసుకునేందుకు వీలుగా Wi-Fi, Bluetooth v5.0, GPS, NFC, FM Radio, 3.5mm ఆడియో సాకెట్, USB Type-C port ఉన్నాయి. మోటో జీ8 ప్లస్ ఫోన్.. కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ పింక్ మొత్తం రెండు కలర్లలో లభ్యం అవుతోంది. 

ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* 6.3 అంగుళాల IPS LCD మ్యాక్స్ విజన్ డిస్ ప్లే
* ఫుల్ హెచ్ డీ రెజుల్యుషన్ 1080×2340 ఫిక్సల్స్
* క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 665 SoCతో 
* 4GB ర్యామ్ సపోర్ట్, 64GB ఇంటర్నల్ స్టోరేజీ
* అడ్రినో 610 GPU (గ్రాఫిక్స్)
* మైక్రో SD కార్డు స్లాట్
* 4,000mAh బ్యాటరీ, 15W టర్బో పవర్ 2 అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్
* ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 48MP ప్రైమరీ సెన్సార్
* సెకండరీ యూనిట్ 16MP వైడ్ యాంగిల్ కెమెరా
* 5MP లెన్స్ డెప్త్ సెన్సార్
* ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ (బ్యాక్)
* Wi-Fi, Bluetooth v5.0, GPS, NFC, FM Radio
* 3.5mm ఆడియో సాకెట్, USB Type-C port
* ఆండ్రాయిడ్ పై వెర్షన్ 9.0