Motorola Edge 50 Fusion 5G
Motorola Edge 50 Fusion 5G : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? ఇదే బెస్ట్ టైమ్.. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G ఫోన్ ధర తగ్గింది. క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఫోన్ (Motorola Edge 50 Fusion 5G) కావాలంటే ఇప్పుడే కొనేసుకోండి. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మీ బడ్జెట్ ధరలోనే లభ్యమవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం కాదని గమనించాలి.
మోటోరోలా అధికారిక ఇ-స్టోర్‌లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ పరికరం భారీ ధర తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. వాస్తవానికి ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ లాంచ్ ధర రూ.24,999 నుంచి ఇప్పుడు డిస్కౌంట్ ధర రూ. 16,500 కన్నా తగ్గింది.
అంతేకాదు.. డ్యూయల్ కెమెరా సెటప్, క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G ధర :
ప్రస్తుతం అధికారిక ఇ-స్టోర్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G రూ. 17,999కు లభ్యమవుతుంది. బ్యాంక్ కార్డులతో కస్టమర్లు రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ధర రూ. 16,500 కన్నా తగ్గుతుంది. పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్‌ను బట్టి కస్టమర్లు రూ. 13,499 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకులు నో-కాస్ట్ ఈఎంఐతో ఆప్షన్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు. మార్ష్‌మల్లౌ బ్లూ, మార్ష్‌మల్లౌ బ్లూ, ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్, ఫారెస్ట్ గ్రీన్ వంటి వివిధ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో పెద్ద 6.7-అంగుళాల FHD+ pOLED ప్యానెల్‌ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.
ఈ మోటోరోలా 5,000mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP సోనీ LYT-700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను అందిస్తుంది. 32MP సెల్ఫీ కెమెరాను కూడా అందిస్తుంది.