Samsung Galaxy M36 : అమెజాన్ అద్భుతమైన ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ M36పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ కొనలేరు!
Samsung Galaxy M36 : శాంసంగ్ గెలాక్సీ M36 ఫోన్ ధర తగ్గింది. అమెజాన్ సేల్ సమయంలో ఈ M36 ఫోన్ ధర సరసమైన ధరకే పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy M36
Samsung Galaxy M36 : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. భారత మార్కెట్లో శాంసంగ్ పాపులర్ M సిరీస్ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ లైనప్‌లో శాంసంగ్ గెలాక్సీ M36 5G (Samsung Galaxy M36) ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో రూ. 6వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ ఛాన్స్. శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M36 డీల్ :
భారత మార్కెట్లో గెలాక్సీ M36 5G ఫోన్ రూ.22,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. కానీ, అమెజాన్ లేటెస్ట్ ఆఫర్ ద్వారా ఇప్పుడు ఈ ఫోన్ రూ.17,499కే లిస్ట్ అయింది. నేరుగా రూ.5,500 డిస్కౌంట్ పొందవచ్చు. SBI క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో ఎంచుకుంటే అదనంగా రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు.
దాంతో ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.16,499కి తగ్గుతుంది. మొత్తంగా రూ.6,500 సేవ్ చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ధరను మరింత తగ్గించుకోవచ్చు. మీ ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా ధర తగ్గింపు ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ M36 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ 7పై రన్ అవుతుంది. శాంసంగ్ ఫోన్ 6 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఈ కేటగిరీలో సాఫ్ట్‌వేర్ సపోర్టు కూడా పొందవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ M36 ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది.
కెమెరాల విషయానికొస్తే.. OISతో కూడిన 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్, బ్యాక్ సైడ్ కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తాయి.