Samsung One UI 8 Beta : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. One UI 8 బీటా రిలీజ్ డేట్, సపోర్టు చేసే ఫోన్లు ఇవే.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

Samsung One UI 8 Beta : శాంసంగ్ నుంచి సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రాబోతుంది. వన్ యూఐ 8 బీటా వెర్షన్ రిలీజ్ కానుంది. కొత్త మార్పులేంటి?

Samsung One UI 8 Beta : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. One UI 8 బీటా రిలీజ్ డేట్, సపోర్టు చేసే ఫోన్లు ఇవే.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

Samsung One UI 8 Beta

Updated On : August 7, 2025 / 5:54 PM IST

Samsung One UI 8 Beta : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూ్స్.. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త సాఫ్ట్‌వేర్ వన్ UI 8 రాబోతుంది. ఆండ్రాయిడ్ 16పై బీటా వెర్షన్ (Samsung One UI 8 Beta) డెవలప్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ S25 సిరీస్‌తో బీటా ప్రోగ్రామ్‌ రిలీజ్ చేయగా ఇప్పుడు బీటాను వైడ్ రేంజ్ పాత ఫ్లాగ్‌షిప్‌లు, ఫోల్డబుల్‌లకు విస్తరిస్తోంది. మీ గెలాక్సీ ఫోన్ కూడా ఈ కొత్త అప్‌డేట్ పొందుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

One UI 8 బీటా : రిలీజ్ డేట్, సపోర్టు చేసే ఫోన్లు :
ఆగస్టు 11వ వారం నుంచి శాంసంగ్ బీటాను గెలాక్సీ S24 సిరీస్, గెలాక్సీ Z ఫోల్డ్ 6, గెలాక్సీ Z ఫ్లిప్ 6లకు విస్తరిస్తుంది. బీటా మొదట భారత్, దక్షిణ కొరియా, UK, USలలో అందుబాటులో ఉంటుంది. వచ్చే సెప్టెంబర్‌లో బీటా ప్రోగ్రామ్ ద్వారా మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుంది.

  • గెలాక్సీ S23 సిరీస్
  • గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, జెడ్ ఫ్లిప్ 5
  • గెలాక్సీ ట్యాబ్ S10
  • గెలాక్సీ A36 5G
  • గెలాక్సీ A35 5G
  • ఈ ఏడాది చివరిలో మరిన్ని మోడళ్లకు వన్ UI 8 అప్‌డేట్ రిలీజ్ కానుంది.
  • వన్ UI 8 వాచ్ అప్‌డేట్ రాబోయే నెలల్లో గెలాక్సీ వాచ్ 8 సిరీస్‌ కూడా అందుబాటులో ఉండొచ్చు.

వన్ UI 8 బీటా ఎలా ఇన్‌స్టాల్ చేయాలి?

Read Also : Samsung Galaxy A36 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కావాలా? అతి చౌకైన ధరకే శాంసంగ్ గెలాక్సీ A36 5G ఫోన్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

  • బీటాలో జాయినింగ్ ఈజీగా ఉంటుంది.
  • శాంసంగ్ మెంబర్లు యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
  • మీ శాంసంగ్ అకౌంట్ ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.
  • హోమ్ స్క్రీన్‌లో “వన్ UI 8 బీటా ప్రోగ్రామ్” బ్యానర్‌ను ట్యాప్ చేయండి.
  • రిజిస్టర్ చేసుకోండి. ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.
  • రిజిస్టర్ తర్వాత బీటా అప్‌డేట్ సాధారణ OTA అప్‌డేట్ మాదిరిగా వస్తుంది.

వన్ యూఐ 8లో కొత్త ఫీచర్లు ఏంటి? :
వన్ యూఐ 8 ఏఐ ఫీచర్లతో వస్తుంది. విజువల్ పాలిష్, పర్ఫార్మెన్స్ బూస్ట్‌ల వరకు కొత్త ఫీచర్లు ఉంటాయి. ఫ్లెక్సిబుల్ స్ప్లిట్-స్క్రీన్ ఆప్షన్లు, అప్‌గ్రేడ్ శాంసంగ్ DeX, క్విక్ షేర్ మెరుగైన మల్టీ టాస్కింగ్‌ను పొందవచ్చు. మై ఫైల్స్ (My Files) యాప్ ఇప్పుడు యాప్ వారీగా డౌన్‌లోడ్‌లను ఫిల్టర్ చేసేందుకు అనుమతిస్తుంది.

క్యాలెండర్, రిమైండర్‌ల వంటి యాప్‌లు విజువల్‌గా మారతాయి. మోడ్‌లు, రొటీన్‌లు కస్టమైజడ్ ఆప్షన్లు ఉంటాయి. అయితే, సెక్యూర్ ఫోల్డర్ ఇప్పుడు యాప్స్, నోటిఫికేషన్‌లను హైడ్ చేయొచ్చు. మెరుగైన యాక్సెసిబిలిటీ, ఈజీ బ్లూటూత్ హియరింగ్ ఎయిడ్, భారీ కీబోర్డ్ బటన్లు వంటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. సాధారణ స్వైప్ గెచర్ ద్వారా కంట్రోలింగ్‌తో కెమెరా యాప్ యాక్సెస్‌ చేయొచ్చు.