Motorola Edge 50 Pro
Motorola Edge 50 Pro : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. మోటోరోలా అభిమానులు (Motorola Edge 50 Pro) ఈ అద్భుతమైన ఆఫర్ అసలు వదులుకోవద్దు. రూ.10,500 కన్నా భారీ తగ్గింపు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కలర్ డిస్‌ప్లే, ఫాస్ట్ పర్ఫార్మెన్స్, 125W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీల్ :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB + 256GB వేరియంట్) రూ.35,999కు లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.26,910కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎడ్జ్ 50 ప్రోపై రూ.9,089 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.1,500 తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ సేవింగ్ చేసుకోవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 6.7-అంగుళాల 1.5K pOLED కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 2,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. హుడ్ కింద, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీతో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరా సెటప్‌లో OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా కలిగి ఉంది.