Motorola Edge 50 Ultra 5G
Motorola Edge 50 Ultra 5G : కొత్త మోటోరోలా ఫోన్ కావాలా? అయితే, ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. రూ.45వేల బడ్జెట్ లోపు ప్రీమియం ఫోన్ కోసం చూస్తుంటే (Motorola Edge 50 Ultra 5G) ఇదే బెస్ట్ టైమ్.. గత జనరేషన్ మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా అసలు ధర రూ. 79,900 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22వేల భారీ తగ్గింపు ధరకు లభ్యమవుతుంది.
ఈ మోటోరోలా ఫోన్ డిజైన్, టెలిఫోటో లెన్స్‌తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్, పర్ఫార్మెన్స్ మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ రూ.20వేల ధర తగ్గింపు తర్వాత రూ.44,999కి అందుబాటులో ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే.. రూ.2వేల వరకు ఆదా చేసుకోవచ్చు. తద్వారా ధర రూ.43వేల కన్నా తగ్గుతుంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఆప్షన్లతో పొందవచ్చు.
Read Also : Hero Glamour X125 : కొత్త హీరో గ్లామర్ X125 బైక్ భలే ఉంది భయ్యా.. ఫీచర్ల కోసమైన ఈ బైక్ ఇంటికి తెచ్చుకోవచ్చు!
మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కూడా పొందవచ్చు. తద్వారా రూ.43,200 వరకు ఉంటుంది. అయితే, కచ్చితమైన వాల్యూ, వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు నెలకు రూ.7,500 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ కోసం ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి యాడ్-ఆన్‌లు కూడా ఉన్నాయి.
మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల pOLED స్క్రీన్‌తో వస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తోంది. బ్రైట్‌నెస్ ప్యానెల్ పొందవచ్చు. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ద్వారా పవర్ పొందుతుంది.
ఈ మోటోరోలా ఫోన్ 4,500mAh బ్యాటరీ, 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్, 64MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ మోటోరోలా ఫోన్ 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.