×
Ad

Motorola Edge 60 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో అతి చౌకైన ధరకే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Motorola Edge 60 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ట్రిపుల్ రియర్ కెమెరా ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది.

1/7
Motorola Edge 60 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (దీపావళి ఎడిషన్) సేల్ ముగినప్పటికీ డీల్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌ ధరలోనే ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనేసుకోవచ్చు.
2/7
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో మోడల్ మొదట ఏప్రిల్ 2025లో రూ. 29,999కి లాంచ్ అయింది. ఇప్పుడు ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఊహించని ధరకు లభ్యమవుతుంది. ఆఫర్‌లు, డిస్కౌంట్‌ల తర్వాత రూ. 13,759 కన్నా తక్కువ ధరకు ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర తగ్గింపు : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో (8GB RAM + 256GB స్టోరేజ్, పాంటోన్ స్పార్కింగ్ గ్రేప్ వేరియంట్) ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.25,999 ధరకు అందుబాటులో ఉంది. అసలు లాంచ్ ధర కన్నా రూ.4వేలు తక్కువగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుదారులు రూ.2,250 అదనపు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. తద్వారా ధర రూ.23,749కి తగ్గుతుంది.
4/7
మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే.. ఫ్లిప్‌కార్ట్ కూడా స్మార్ట్ ఎక్స్ఛేంజ్ డీల్ అందిస్తోంది. ఉదాహరణకు.. మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్‌ ధర రూ.9,990 వరకు తగ్గింపు పొందవచ్చు. కేవలం రూ.13,759కి ఎడ్జ్ 60 ప్రో సొంతం చేసుకోవచ్చు. మొత్తం రూ.16,240 సేవ్ చేసుకోవచ్చు.
5/7
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్పెసిఫికేషన్లు : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i స్క్రీన్‌ ప్రొటెక్షన్ అందిస్తుంది. అయితే, MIL-STD 810H మన్నిక, IP68, IP69 రేటింగ్స్ కలిగి ఉంది.
6/7
హుడ్ కింద, ఈ మోటోరోలా మీడియాటెక్ డైమన్షిటీ 8350 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, భారీ 6000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
7/7
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. OISతో కూడిన 50MP సోనీ LYTIA 700C ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, 50x సూపర్ జూమ్‌ అందించే 10MP టెలిఫోటో లెన్స్‌తో పాటు వస్తుంది. ఫ్రంట్ సైడ్ హై క్వాలిటీ పోర్ట్రెయిట్‌, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరా ఉంది.