MSSC vs SSY
MSSC vs SSY Schemes : మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాలలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఉన్నాయి.
ఈ పథకాల్లో మహిళలు, బాలికల కోసం ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటి పథకాల్లో లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన మధ్య వ్యత్యాసం ఏంటి? ఈ రెండింటిలో ఏది ఎక్కువ రాబడిని అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
MSSC, SSY పథకాలు ఏంటి?:
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్‌ను కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2023న ప్రారంభించింది. కేవలం 2 ఏళ్ల మెచ్యూరిటీ వ్యవధి కలిగిన స్వల్పకాలిక సేవింగ్స్ స్కీమ్. మహిళలు తక్కువ సమయంలో తక్కువ రిస్క్‌తో మంచి రాబడిని పొందవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన పథకం విషయానికి వస్తే.. కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రారంభించింది. ఈ పథకం ముఖ్యంగా కూతుళ్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా కాలం పాటు పొదుపు చేసిన తర్వాత కుమార్తెల పేరు మీద భారీ రాబడిని పొందవచ్చు.
MSSC, SSYలో ఎంత వడ్డీ వస్తుందంటే? :
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో మహిళా పెట్టుబడిదారులు 7.5శాతం రేటుతో వడ్డీని పొందవచ్చు. సుకన్య సమృద్ధి యోజన దీర్ఘకాలిక పథకం, 8.2శాతం రేటుతో వడ్డీని అందిస్తుంది. దీర్ఘకాలంలో పిల్లల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు కూడబెట్టే వారికి ఈ పథకం బెస్ట్ అని చెప్పవచ్చు.
MSSC, SSY పథకాల్లో ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? :
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్‌లో పెట్టుబడిని కేవలం రూ. 1000తో ప్రారంభించవచ్చు. ఇందులో గరిష్టంగా రూ. 2లక్షల పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ఏ వయసు స్త్రీ అయినా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో మైనర్ కుమార్తెల కోసం పెట్టుబడిని వారి సంరక్షకులు కూడా ప్రారంభించవచ్చు.
SSYలో పెట్టుబడిని కూతుళ్ల పేరుతో మాత్రమే చేయవచ్చు. పెట్టుబడికి ముందు కుమార్తెల వయస్సు 10 ఏళ్ల కన్నా తక్కువ ఉండాలి. ఇందులో, ఒక ఏడాదిలో రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
SSY కింద ఏడాదికి రూ.250 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. MSSC, SSY మధ్య ఏ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది? మీ కుమార్తె పేరు మీద పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే అధికరాబడిని పొందవచ్చు.
అయితే, మీకు MSSC పథకం చాలా మంచిది. ఏ వయసు స్త్రీలైనా ఇందులో ఈజీగా పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో వచ్చే వడ్డీని కలిపి చెల్లిస్తారు. దాంతో పిల్లల పేరిట ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీగా నగదు పొందవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.