భారత్‌లో అత్యంత ధనవంతుడిగా ముకేశ్.. టాప్-10 కుబేరులు వీరే.. ఎన్ని కోట్లాది రూపాయలున్నాయో తెలుసా?

ఫోర్బ్స్ ఇండియన్ బిలియనీర్ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన గౌతం అదానీ ఆస్తుల నికర విలువ రూ.7,00,980 కోట్లు.

ఫోర్బ్స్ ఇండియన్ బిలియనీర్ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ రెండో స్థానంలో నిలిచారు. ముకేశ్ అంబానీ ఆస్తుల నికర విలువ రూ.9,68,020 కోట్లు. 2023లో కంటే ఇప్పుడు ఆయన ఆస్తుల విలువ 39.76 శాతం పెరిగింది.

అలాగే, ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ ఇండియన్ బిలియనీర్ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన గౌతం అదానీ ఆస్తుల నికర విలువ రూ.7,00,980 కోట్లు. వరల్డ్ బిలియనీర్ల జాబితాలో 200 మంది భారతీయులు చోటు సంపాదించుకున్నారు. గత ఏడాది ఈ జాబితాలో 169 మంది భారతీయులు ఉండేవారు.

భారత్‌లో టాప్-10 బిలియనీర్లు

  • ముఖేశ్ అంబానీ-నికర విలువ 116 బిలియన్ డాలర్లు
  • గౌతమ్ అదానీ- నికర విలువ 84 బిలియన్ డాలర్లు
  • శివ్ నాడార్- నికర విలువ 36.9 బిలియన్ డాలర్లు
  • సావిత్రి జిందాల్- నికర విలువ 33.5 బిలియన్ డాలర్లు
  • దిలీప్ షాంఘ్వి- నికర విలువ 26.7 బిలియన్ డాలర్లు
  • సైరస్ పూనావాలా- నికర విలువ 21.3 బిలియన్ల డాలర్లు
  • కుశాల్ పాల్ సింగ్- నికర విలువ 20.9 బిలియన్ డాలర్లు
  • కుమార్ బిర్లా – నికర విలువ 19.7 బిలియన్ డాలర్లు
  • రాధాకిషన్ దమాని- నికర విలువ 17.6 బిలియన్ డాలర్లు
  • లక్ష్మీ మిట్టల్- నికర విలువ 16.4 బిలియన్ డాలర్లు

కాగా, ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ జాబితాలో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ సహా ఆయన కుటుంబం రూ.19.43 లక్షల కోట్ల సంపదతో మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్ బర్గ్, లారీ ఎలిసన్ ఉన్నారు.

Also Read: వామ్మో.. తెలుగు రాష్ట్రాల్లో జియో యూజర్లు ఎంతగా పెరిగారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు