వామ్మో.. తెలుగు రాష్ట్రాల్లో జియో యూజర్లు ఎంతగా పెరిగారో తెలుసా?

Jio: తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య మొత్తం కలిపి 3.24 కోట్లకు చేరుకుంది.

వామ్మో.. తెలుగు రాష్ట్రాల్లో జియో యూజర్లు ఎంతగా పెరిగారో తెలుసా?

Jio

తెలుగు రాష్ట్రాల్లో జియో మొబైల్ చందాదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా, ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. రిలయన్స్ జియోలో ఈ ఏడాది జనవరిలో తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 2,59,788 చందాదారులు చేరారు. ఎయిర్‌టెల్ కంటే జియో కొత్తగా సంపాదించుకున్న 4జీ, 5జీ యూజర్ల సంఖ్య కొన్ని రెట్లు అధికంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య మొత్తం కలిపి 3.24 కోట్లకు చేరుకుంది. జనవరి నెలలో ఎయిర్‌టెల్లో 1.18 లక్షల కొత్త మొబైల్ చందాదారులు చేరారు. వొడాఫోన్ ఐడియా 44,649 మంది చందాదారులను కోల్పోగా, బీఎస్ఎన్ఎల్ 16,146 మందిని కోల్పోయింది.

ఇక దేశవ్యాప్తంగా జనవరిలో జియోలో 41.78 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. దేశంలో ఎయిర్‌టెల్‌లో 7.52 లక్షల మంది చేరారు. జనవరి నాటికి దేశంలో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 52.67 కోట్లకు చేరుకుందని ట్రాయ్ తెలిపింది. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ వాడని వారు ఎవరూ లేరు. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగమూ విపరీతంగా పెరిగిపోయింది.

Also Read: ఐఫోన్‌, మ్యాక్‌బుక్స్, ఐపాడ్‌, విజన్ ప్రొ హెడ్‌సెట్స్‌ వాడే వారికి వార్నింగ్