ఐఫోన్‌, మ్యాక్‌బుక్స్, ఐపాడ్‌, విజన్ ప్రొ హెడ్‌సెట్స్‌ వాడే వారికి వార్నింగ్

iPhone: ఆ సిస్టమ్స్‌లో హ్యాకర్లు ఆర్బిటరీ కోడ్‌ను ప్రవేశపెట్టవచ్చని తెలిపింది. ఐఫోన్ ఎక్స్ఎస్..

ఐఫోన్‌, మ్యాక్‌బుక్స్, ఐపాడ్‌, విజన్ ప్రొ హెడ్‌సెట్స్‌ వాడే వారికి వార్నింగ్

iPhone

యాపిల్‌ యూజర్లకు కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. ఐఫోన్‌లు, మ్యాక్‌బుక్స్, ఐపాడ్‌, విజన్ ప్రొ హెడ్‌సెట్స్‌లో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్‌కి సంబంధించి భద్రతాపర లోపం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.

దీని ప్రభావం 17.4.1కి ముందున్న సఫారీ వెర్షన్, యాపిల్ మ్యాక్‌ఓఎస్ వెంచురా 13.6.6కి ముందు ఉన్న వెర్షన్‌లు, 14.4.1కి ముందున్న యాపిల్ మ్యాక్‌ఓఎస్ సొనొమా వెర్షన్‌లు, 1.1.1కి ముందున్న యాపిల్ విజన్‌ఓఎస్ వెర్షన్‌లు, 17.4.1కి ముందున్న యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ వెర్షన్‌లు, 16.7. 7కి ముందున్న యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ వెర్షన్‌లు, వాటి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌పై పడవచ్చని తెలిపింది.

ఆ సిస్టమ్స్‌లో హ్యాకర్లు ఆర్బిటరీ కోడ్‌ను ప్రవేశపెట్టవచ్చని తెలిపింది. ఐఫోన్ ఎక్స్ఎస్, అంగుళాల ఐప్యాడ్ ప్రొ 12.9, 10.5 అంగుళాల ఐప్యాడ్ ప్రొ, 11 అంగుళాల ఐప్యాడ్ ప్రొ, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్, ఐప్యాడ్ మిని యూజర్లు పలు వెర్షన్‌లకు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పింది.

యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్. మ్యాక్ఓఎస్, విజన్ఓఎస్ యూజర్లు భద్రతా ప్యాచ్‌లు ఉన్న తాజా వెర్షన్‌లకు అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. అలాగే, బహిరంగ ప్రాంతాల్లో ఉండే ఉచిత వై-ఫై నెట్‌వర్క్‌లను వాడొద్దని చెప్పింది. అటాకర్ల మాల్‌వేర్ రిస్క్ నుంచి తప్పించుకోవడానికి యాపిల్ స్టోర్ వంటి యాప్స్, సాఫ్ట్‌వేర్లను నమ్మకమైన సోర్సుల నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. డేటాను కోల్పోయే ప్రమాదం లేకుండా క్రమం తప్పకుండా ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకోవాలని చెప్పింది.

Also Read: ప్రపంచంలోనే శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్.. తొలి ఫొటొ వచ్చేసింది.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏమన్నారంటే?