ప్రపంచంలోనే శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్.. తొలి ఫొటొ వచ్చేసింది.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏమన్నారంటే?

ఎంఆర్ఐ స్కాన్ విజయవతం కావడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పరిశోధకులను అభినందించారు. ఈ స్కానర్ ద్వారా ఇప్పటి వరకు ..

ప్రపంచంలోనే శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్.. తొలి ఫొటొ వచ్చేసింది.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏమన్నారంటే?

Most Powerful MRI Scanner

Most Powerful MRI Scanner : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్ మానవ మెదడుకు సంబంధించిన తొలి ఫొటోలను అందించింది. మెదడులో తలెత్తే అనారోగ్య సమస్యలను ఖచ్చితత్వంతో వెలుగులోకి తెచ్చే విధంగా పరిశోధకులు ఆశించే స్థాయిలో ఈ స్కానర్ తన పనిని పూర్తి చేసింది. ఈ స్కానర్ ద్వారా మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ కు ఆహారం అందించే చిన్న నాళాలు, ఇప్పటి వరకు దాదాపు కనిపించని సెరెబెల్లమ్ వివరాలనుకూడా చూడొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఫ్రెంచ్, జన్మన్ ఇంజనీర్ల భాగస్వామ్యంతో రెండు దశాబ్దాల పరిశోధన ఫలితంగా ఈ డిజైన్ యంత్రం రూపొందించారు. ఫ్రాన్స్ అటామిక్ ఎనర్జీ కమిషన్ (సీఈఏ) పరిశోధకులు ఈ ఎంఆర్ఐ స్కానర్ ను 2021లో మొదటిసారి గుమ్మడికాయపై స్కాన్ చేయడానికి ఉపయోగించారు.

Also Read : రూ.50 కోట్ల బంగారు టాయిలెట్‌ చోరీ కేసులో.. నేరాన్ని అంగీకరించిన వ్యక్తి

మనిషి మెదడును స్కాన్ చేసేందుకు అనుమతులు రావడంతో.. గత కొన్ని నెలలుగా దాదాపు 20 మంది ఆరోగ్యవంతమైన వాలంటీర్లు తొలిసారి అత్యంత శక్తివంతమైన ఎంఆర్ఐ మిషన్ ద్వారా స్కాన్ చేయించుకున్నారు. స్కానర్ లో మనిషి మెదడు లోపలి భాగం చాలా స్పష్టంగా కనిపించింది. మునుపెన్నడూ చూడలేని విధంగా మెదడులోని ప్రతిదానిని క్షుణ్ణంగా చూసేలా ఈ మిషన్ పనిచేస్తుందని ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయిన భౌతిక శాస్త్రవేత్త అలెగ్జాండర్ విగ్నాండ్ తెలిపారు. ఆస్పత్రుల్లో సాధారణంగా ఉపయోగించే ఎంఆర్ఐ స్కానర్ల కంటే 10 రెట్లు ఎక్కువ ఖచ్చితమైన, స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. ఈ శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్ ద్వారా మెదడులోని మైక్రోస్కోపిక్ రెటినాస్ ను కూడా స్పష్టంగా చూడొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు.

Also Read : Virat Kohli : భూతద్దం, సూర్యకాంతిని ఉప‌యోగించి విరాట్ కోహ్లి చిత్రం.. వీడియో వైర‌ల్

ఎంఆర్ఐ స్కాన్ విజయవతం కావడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పరిశోధకులను అభినందించారు. ఈ స్కానర్ ద్వారా ఇప్పటి వరకు అందుబాటులోలేని, అత్యంత ఖచ్చితమైన చిత్రంను అందించింది. ఇది మన ఆరోగ్య అధ్యయనానికి ఒక పెద్ద పురోగతి అని అన్నారు. అమెరికా, దక్షిణ కొరియా కూడా ఇదే తరహాలో ఎంఆర్ఐ స్కానర్ ను రూపొందించే పనిలో ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు వాటిని మానవుడి మెదడులపై ఉపయోగించలేదు. అల్జీమర్స్ వంటి వ్యాధుల కారణాలు, మెదడుపై డ్రగ్స్ ప్రభావం వంటి వాటిని అర్ధం చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.