Virat Kohli : భూతద్దం, సూర్యకాంతిని ఉప‌యోగించి విరాట్ కోహ్లి చిత్రం.. వీడియో వైర‌ల్

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Virat Kohli : భూతద్దం, సూర్యకాంతిని ఉప‌యోగించి విరాట్ కోహ్లి చిత్రం.. వీడియో వైర‌ల్

Virat Kohli Portrait Created With Magnifying Glass And Sunlight

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. కొంద‌రు ఫ్యాన్స్ కోహ్లి పై ఉన్న అభిమానాన్ని అంద‌రి కంటే భిన్నంగా చాటుకుంటుంటారు. ఇలాంటి వారిలో కార్తీక్ ఒక‌రు. స‌న్ లైట్ ఆర్టిస్ట్ అయిన అత‌డు.. ఒక చెక్క పై భూత‌ద్దం ద్వారా సూర్య‌కాంతిని ఉప‌యోగించి కోహ్లి యొక్క అద్భుత‌మైన చిత్రాన్ని రూపొందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అత‌డు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోలో ఏం ఉందంటే..? ఓ చెక్క‌పై పెన్సిల్‌తో ముందుగానే విరాట్ కోహ్లి చిత్రాన్ని గీశాడు. ఆ త‌రువాత భూత‌ద్దాన్ని తీసుకుని సూర్య‌కిర‌ణాలు ద్వారా చెక్క ఉప‌రిత‌లం కాలేలా చేశాడు. అయితే.. ఇందుకు చేతిని ఒకే స్థితిలో ఉంచాల్సి ఉంటుంది. ఎంతో ఓర్పు, ఏకాగ్ర‌త అవ‌స‌రం. ఎంతో క‌ఠిన‌మైన ఈ ప‌నిలో చిన్న త‌ప్పు జ‌రిగినా కూడా అప్పటి వ‌ర‌కు ప‌డిన శ్ర‌మ వృథా అవుతుంది. అత‌డు కోహ్లి క‌నుబొమ్మ‌లైనా, గ‌డ్డం, జుట్టు ఇలా ప్ర‌తీ భాగాన్ని చాలా చ‌క్క‌గా వ‌చ్చేలా ఎంతో ఓర్పుతో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

Hardik Pandya : బాధ‌తో ఒంటరిగా డ‌గౌట్‌లో కూర్చున్న‌ పాండ్య‌.. వెళ్లి ఓదార్చిన అంబ‌టి రాయుడు

కోహ్లి చిత్రాన్ని రూపొందించేందుకు ఎంత స‌మ‌యం పట్టింది అనే విష‌యాన్ని అయితే అత‌డు వెల్ల‌డించ‌లేదు కానీ.. వీడియో చూస్తుంటే ఇందుకు అత‌డికి రెండు లేదా మూడు రోజులు స‌మ‌యం ప‌ట్టిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. కోహ్లి బాగానే ఆడుతున్నా కూడా ఆర్‌సీబీ ఈ సీజ‌న్‌లో త‌డ‌బ‌డుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు మ్యాచులు ఆడిన ఆ జ‌ట్టు కేవ‌లం ఒకే ఒక మ్యాచులో విజ‌యాన్ని సాధించింది. ఆ జ‌ట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది. ఆర్‌సీబీ త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను ఏప్రిల్ 6 శ‌నివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నుంది. రాజ‌స్థాన్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.

RCB vs LSG : కోహ్లిని ఔట్ చేస్తాన‌ని మాట ఇచ్చి.. ప‌క్కాగా ప్లాన్ చేసి.. తొలి వికెట్‌గా ఔట్ చేసిన ల‌క్నో యువ స్పిన్న‌ర్‌.. కోచ్ ఆనందం