కొత్త MD కోసం వెతుకుతున్న ముకేశ్ అంబానీ

  • Publish Date - January 11, 2020 / 02:56 AM IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ తమ కంపెనీకి కొత్త MDని వెతికే పనిలో ఉన్నారు. సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త MDని వెతుకుతున్నారు. మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ బాధ్యతలు వేర్వేరుగా ఉండాలని  సెబీ నిబంధనలు చెబుతున్నాయి. దీంతో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఈ సంవత్సరం (ఏప్రిల్ 1, 2020) నుంచి సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కంపెనీలో MDగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి అంబానీ కుటుంబం నుంచి ఉండకూడదని వెల్లడించారు. అంతేకాదు అంబానీ వయసురీత్యా MDగా చేపట్టకూడదని చట్టం చెబుతోంది.

ఇక కొత్త నిబంధనల ప్రకారం.. బోర్డు ఛైర్ పర్స్ న్ గా ఉండే వ్యక్తి ఇక నుంచి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉదయ్ కొటక్ సుబీ కార్పొరేట్ గవర్నెన్స్ కమిటీ 2017లో తొలిసారి ఛైర్మన్, MD వేర్వేరుగా ఉండాలని వెల్లడించింది. అందుకు 2018లో సెబీ ఆమోదం తెలిపింది. అయితే కంపెనీలుకు సెబీ మరికొంత సమయం ఇస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.