Mukesh Ambani's Childrens
Reliance Board : రిలయన్స్ గ్రూప్ వాటాదారులు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ తన పిల్లలైన ఇషా అంబానీ, ఆకాష్, అనంత్ అంబానీలను కంపెనీ డైరెక్టర్ల బోర్డులోకి చేర్చుకున్నారు. రిలయన్స్ బోర్డులో చేరేందుకు ముఖేష్ అంబానీ పిల్లలకు వాటాదారుల ఆమోదం లభించింది. అంబానీ కుటుంబసభ్యులను కంపెనీ బోర్డు డైరెక్టర్లుగా చేర్చుకోవడంతో కొత్త శకానికి నాంది పలికినట్లయింది.
Also Read : Hamas terrorists : ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌ల దాడి..ముగ్గురు హమాస్ ఉగ్రవాదుల హతం
రిలయన్స్ బోర్డులో నియమితులైనందుకు కవలలు ఇషా, ఆకాష్ (32)లకు 98 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. 28 ఏళ్ల అనంత్‌కు 92.75 శాతం ఓట్లు వచ్చాయి. ముగ్గురు అంబానీ వారసులు గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్‌కి చెందిన కీలక వ్యాపారాలతో సన్నిహితంగా ఉన్నారు. ఇషా అంబానీ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చదివి రిలయన్స్ రిటైల్ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు.
Also Read : Asian Para Games: ఆసియా పారా గేమ్స్ ఆర్చరీలో శీతల్ దేవికి బంగారు పతకం
ఆమె భారతీయ బిలియనీర్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ఇషా ఫార్మాస్యూటికల్స్ , రియల్ ఎస్టేట్ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇషా కవల సోదరుడు గత ఏడాది జూన్‌లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్‌గా పదోన్నతి పొందారు. అతని తండ్రి పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన అధికారాన్ని చేపట్టారు. అనంత్ సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి రంగంపై ఆసక్తి చూపిస్తున్నారు.