అదరహో అంబానీ : టాప్ 6 క్లబులోకి రిలయన్స్.. రికార్డు బ్రేక్ 

  • Publish Date - November 20, 2019 / 09:11 AM IST

ఆయిల్, టెలికం, రిటైల్ రంగం సహా వివిధ రంగాల్లో అగ్రగామిగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మరో అరుదైన ఘనత సాధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యాపిటలైజేషన్
రూ.9.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ నడిపే RIL కంపెనీ ప్రస్తుతం.. 138 బిలియన్ల డాలర్ల విలువకు చేరుకుంది. మంగళవారం (నవంబర్ 19, 2019) ట్రేడింగ్ ముగిసి సమయానికి బ్రిటిష్ ఎనర్జీ దిగ్గజం 132 బిలియన్ డాలర్ల విలువతో పోలిస్తే రిలయన్స్ టాప్‌లో  నిలిచింది. 

డాలర్ మారకంలో రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూ 133 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా బ్రిటిషన్ ఎనర్జీ దిగ్గజం BPని దాటేసి.. టాప్ 6 క్లబ్ ఆయిల్ సూపర్ మేజర్స్ కంపెనీల్లో ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఒకటిగా నిలిచింది. రిలయన్స్ షేర్ వ్యాల్యూ గడిచిన ఏడాది కాలంలో 35 శాతానికి పైగా లాభపడింది. ఆగస్టులో బిలియనీర్ యజమాని కంపెనీ నికర రుణాన్ని 18నెలల్లో జీరోకు తగ్గించే ప్రణాళికలను ప్రకటించిన తర్వాత రిలయన్స్ షేర్లు ఈ ఏడాది బెంచ్ మార్క్ ఇండెక్స్ కంటే మూడు రెట్లు పెరిగాయి. 

షేర్ల విలువ పెరగడంతో అంబానీ నికర ఆదాయం ఒక్కసారిగా 56 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అలీబాబా గ్రూపు అధినేత జాక్ మా నికర ఆదాయం కంటే ఆసియాలో సంపన్న వ్యక్తిగా ముఖేశ్ అంబానీ నిలిచారు. గతనెల ముగిసే సమయానికే తొలిసారి రిలయన్స్ మార్కెట్ BP విలువ పెరిగింది. ఇప్పుడు బ్రిటీష్ కంపెనీ షేర్లను అధిగమించి రిలయన్స్ షేర్ బుధవారం (20 నవంబర్ 2019) దూసుకెళ్లింది.