Netflix Sharing Passwords : పాస్‌వర్డ్ షేరింగ్ చేస్తే ఛార్జీల బాదుడే.. నెట్‌ఫ్లిక్స్‌కు కోలుకోలేని షాకిచ్చిన యూజర్లు..!

Netflix Sharing Passwords : మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ (Kantar) నివేదిక ప్రకారం.. పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఛార్జీలు విధించడంతో నెట్‌ఫ్లిక్స్ 2023 మొదటి త్రైమాసికంలో స్పెయిన్‌లో మిలియన్ మంది యూజర్లను కోల్పోయింది.

Netflix Sharing Passwords : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) పాస్‌వర్డ్ షేరింగ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. అకౌంట్ పాస్‌వర్డ్ ద్వారా యూజర్ల సంఖ్యపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటినుంచి నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను భారీగా తగ్గించింది. పాస్‌వర్డ్ షేరింగ్‌ విషయంలో నెట్‌ఫ్లిక్స్ సవరించిన విధానంతో బ్యాక్‌ఫైర్ అయినట్లు ఇప్పుడు కనిపిస్తోంది.

లేటెస్ట్ రిజల్ట్స్ ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను తగ్గించడం ప్రారంభించినప్పటి నుంచి ఒక మిలియన్ స్పానిష్ యూజర్లను కోల్పోయింది. మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ Kantar నివేదిక ప్రకారం.. (Netflix 2023) మొదటి త్రైమాసికంలో స్పెయిన్‌లో మిలియన్ కన్నా ఎక్కువ మంది యూజర్లను కోల్పోయింది. పాస్‌వర్డ్-షేరింగ్‌ను నివారించేందుకు కంపెనీ చేసిన ప్రయత్నాలు ఒక్కసారిగా బెడిసికొట్టాయి.

వినియోగదారులు తమ లాగిన్ వివరాలను ఇతర ఫ్యామిలీలతో షేర్ చేయకుండా నిరోధించడానికి Netflix కంపెనీ ఫిబ్రవరి ప్రారంభంలో స్పానిష్ యూజర్లకు నెలవారీ రుసుము 5.99ని ప్రవేశపెట్టింది. అంటే.. భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 500 వరకు ఛార్జీలు విధించింది. పాస్‌వర్డ్ షేరింగ్ గుర్తించడంతో పాటు నిరోధించడానికి కంపెనీ టెక్నికల్ రిస్ట్రిక్షన్ కూడా అమలు చేసింది.

Read Also : MG Comet EV Launch : అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లతో ఎంజీ కామెట్ EV కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 230కి.మీ దూసుకెళ్తుంది.. ధర ఎంతంటే?

హోం స్ట్రీమింగ్ వంటి సర్వేలపై ఆధారపడిన కాంటార్ పరిశోధన, నెట్‌ఫ్లిక్స్ ద్వారా కోల్పోయిన యూజర్లలో మూడింట రెండు వంతుల మంది ఇతర కుటుంబాలతో పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకున్నారని తెలిపింది. తద్వారా ఒక మిలియన్ మంది యూజర్లను నెట్‌ఫ్లిక్స్ నష్టపోయింది. వారిలో ఎక్కువ మంది పేమెంట్ సబ్ స్ర్కైబర్లు కాదని నివేదిక పేర్కొంది.

Netflix starts charging users for sharing passwords in select countries

పాస్‌వర్డ్ షేరింగ్ ఛార్జీల ఎఫెక్ట్.. :
కాంతర్ వరల్డ్‌ప్యానెల్ డివిజన్‌లోని గ్లోబల్ ఇన్‌సైట్ డైరెక్టర్ డొమినిక్ సున్నెబో ప్రకారం.. పాస్‌వర్డ్-షేరింగ్‌పై కంపెనీ అమలు చేసిన విధానం కారణంగానే యూజర్ల సంఖ్య బాగా తగ్గిందని పేర్కొన్నారు. అయితే, డేటాలో కేవలం నాలుగింట ఒక వంతు మాత్రమే దీర్ఘకాలిక ప్రభావం ఉండకపోవచ్చు. పాస్‌వర్డ్-షేరింగ్‌పై నెగటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ ఆదాయ నష్టాన్ని నివారించడంలో సాయపడింది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోకుండా ఉండేందుకు వీలుగా కంపెనీ తగు చర్యలను చేపట్టాల్సి ఉంది.

నెట్‌ఫ్లిక్స్ లాటిన్ అమెరికా దేశాల్లో సర్వీసులను ప్రారంభించిన తర్వాత పోర్చుగల్, కెనడా, న్యూజిలాండ్‌లలో పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఒకే విధమైన రుసుమును అమలు చేసింది. ఈ రుసుంను ప్రకటించిన సమయంలో ప్రతి మార్కెట్‌లోనూ నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే నెట్‌ఫ్లిక్స్ అది కొద్దికాలమేనని భావించింది. ఎందుకంటే.. యూజర్ల అకౌంట్ల కోసం చెల్లించని యూజర్లు తమ సొంత అకౌంట్ కోసం సైన్ అప్ చేయడం ప్రారంభిస్తారని భావించింది.

అమెరికాలో కన్నా కెనడాలోనే నెట్ ఫ్లిక్స్ ఆదాయ వృద్ధి వేగవంతం అయ్యింది. ఇప్పుడు అమెరికాలో కన్నా వేగంగా పెరుగుతోందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌లను షేర్ చేసేందుకు యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తే.. భారత మార్కెట్లోని వినియోగదారులు ఎలా స్పందిస్తారో చూడాలి. నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో పాస్‌వర్డ్ షేరింగ్ విధానాలను అమలు చేస్తే.. చాలా మంది యూజర్లను కూడా కోల్పోవచ్చు.

Read Also : Amazon Great Summer Sale : అమెజాన్‌‌లో గ్రేటర్ సమ్మర్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై 40శాతం వరకు తగ్గింపు.. మరెన్నో ఆఫర్లు..!

ట్రెండింగ్ వార్తలు