×
Ad

Netflix Update : నెట్‌ఫ్లిక్స్‌లో మూవీలు, టీవీ సిరీస్ చూసేటప్పుడు ఇక యాడ్స్ కనిపించవు!

Netflix Update : ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వినియోగదారులకు శుభవార్త.. కిడ్స్ సంబంధిత మూవీలు, టీవీ సిరీస్ చూసే సమయంలో యాడ్స్ కనిపించవు. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది.

Netflix Update_ You will not get ads during movies and TV series for kids

Netflix Update : ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వినియోగదారులకు శుభవార్త.. కిడ్స్ సంబంధిత మూవీలు, టీవీ సిరీస్ చూసే సమయంలో యాడ్స్ కనిపించవు. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ఈ ఏడాది మేలో ప్రత్యర్థి డిస్నీ+ పిల్లల ప్రోగ్రామింగ్‌లపై యాడ్స్-ఫ్రీ విధానాన్ని తీసుకొచ్చింది. నివేదికల ప్రకారం.. పిల్లలకు సంబంధించిన ప్రొగ్రామ్స్ విషయంలో కమర్షియల్ కాకుండా ఉండేలా చూడాలని నెట్‌ఫ్లిక్స్ పార్టనర్లకు తెలిపింది. అయినప్పటికీ, Stranger Things’, ‘Bridgerton’, ‘Squid Game’ వంటి అసలైన సిరీస్‌లు ఇప్పటికీ యాడ్స్ వస్తున్నాయని వినియోగదారులు భావిస్తున్నారు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వంటి సంస్థలు పిల్లలకు యాడ్స్ విషయంలో కఠినమైన ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చాయి.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ ఆన్‌లైన్ వీడియో అడ్వర్టైజింగ్‌లో కీలకమైన ప్లేయర్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. కేవలం యాడ్స్ సేల్స్ ద్వారా ఏడాదికి 4 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తుంది. Google యాజమాన్యంలోని YouTube ఇప్పుడు అధికారికంగా డేటా మొత్తాన్ని పరిమితం చేస్తుంది. పిల్లల కోసం ఉద్దేశించిన కంటెంట్‌ను క్రియేటర్లు వినియోగించుకోవచ్చు. తల్లిదండ్రుల సమ్మతి లేకుండా పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని YouTube సేకరించిందంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో 2019లో US ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) కంపెనీకి 170 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.

Netflix Update_ You will not get ads during movies and TV series for kids

జూన్‌లో నెట్‌ఫ్లిక్స్ దాని నష్టాలను తగ్గించడానికి ప్లాట్‌ఫారమ్‌కు ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించేందుకు యాడ్ సపోర్టు టైర్‌ (Ad Support Tier)ను ప్రారంభించబోతున్నట్లు ధృవీకరించింది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో యాడ్స్ డీల్స్ కోసం ఒప్పందాలపై మళ్లీ చర్చిస్తోంది. అయితే యాడ్స్ మార్కెట్‌ అధికంగా ఉన్న దేశాలలోనే ముందుగా లాంచ్ చేయనుంది. నెట్ ఫ్లిక్స్ తగ్గుతున్న యూజర్ బేస్ కారణంగా 2023 ప్రారంభంలో న్యూ యాడ్-సపోర్టు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభించనుంది. ఇందుకోసం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌తో నెట్‌ఫ్లిక్స్ భాగస్వామిగా చేరింది.

Read Also : Netflix Share Password : నెట్ ఫ్లిక్స్ కొత్త ప్రయోగం.. మీ ఫ్రెండ్స్‌తో పాస్‌వర్డ్ షేరింగ్‌ చేస్తే.. ఛార్జీలు తప్పవు!