×
Ad

New Bank Rule : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇకపై 4 నామినీలను యాడ్ చేసుకోవచ్చు!

New Bank Rule : నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు.. బ్యాంకు ఖాతాదారుల ఖాతాలు, లాకర్లకు ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. ఇకపై 4 నామినీలను చేర్చుకోవచ్చు.

New Bank Rule

New Bank Rule : బ్యాంకు ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్.. వచ్చే నెల నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు, లాకర్ వినియోగదారులు భారీగా ఉపశమనం పొందవచ్చు. ఇకపై బ్యాంకు ఖాతాల్లో కేవలం ఒకరిని కాకుండా నలుగురిని నామినీలుగా చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సవరణ చట్టం 2025 కీలకమైన నిబంధనలు నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

నివేదికల ప్రకారం.. ఈ కొత్త నిబంధనలలో (New Bank Rule) నామినీలకు సంబంధించిన పూర్తి నిబంధనలు ఇలా ఉన్నాయి. చట్టంలోని సెక్షన్లు 10, 11, 12, 13 అనేవి వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని గతంలోనే సూచించింది. ఈ సెక్షన్లు అన్నీ బ్యాంకు ఖాతాలు, బ్యాంకు లాకర్లలో భద్రంగా ఉంచిన వస్తువులకు వర్తిస్తాయి.

ఖాతాదారులు, నామినీలకు మార్గదర్శకాలివే :
కొత్త నిబంధనల ప్రకారం.. బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాంకు అకౌంట్లలో నలుగురు నామినీలను ఎంచుకోవచ్చు. క్లెయిమ్‌లు చేసేటప్పుడు ఖాతాదారులు తమ నామినీల ప్రక్రియను వరుస క్రమంలో క్రమబద్ధీకరించుకోవచ్చు. అయితే, బ్యాంక్ లాకర్ల విషయంలో వరుసగా నామినీలు మాత్రమే అనుమతిస్తారు. అంటే.. మొదటి నామినీ అందుబాటులో లేకపోతే రెండో నామినీ క్లెయిమ్స్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : RBI New Rules : బంగారమే కాదు.. వెండిపై కూడా బ్యాంకులో లోన్లు ఇస్తారు తెలుసా? RBI కొత్త మార్గదర్శకాలు తప్పక తెలుసుకోండి!

ఖాతాదారులకు కలిగే ప్రయోజనాలివే :
ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకు ఖాతాదారులు ప్రతి నామినీకి హక్కుల శాతాన్ని స్పష్టం చేయాలని సూచించింది. మొత్తం 100శాతంగా ఉండాలి. ఉదాహరణకు.. నలుగురు నామినీలను చేర్చితే అందులో మొదటి నామినీకి 40శాతం, రెండో నామినీకి 30శాతం, మూడో నామినీకి 20శాతం, నాల్గో నామినీకి 10శాతం కావచ్చు. బ్యాంకు ఖాతాదారులకు ప్రాధాన్యతల ప్రకారమే నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

క్లెయిమ్ ప్రక్రియలో పారదర్శకతను అందిస్తుంది. అదనంగా, ఎక్కువ నామినీలను చేర్చడం లేదా క్యాన్సిల్ చేయడం లేదా ఎడిట్ చేయడం వంటి విధానాలు, ఫారమ్‌లను వివరించే బ్యాంకింగ్ కంపెనీల (నామినేషన్) నియమాలు 2025 త్వరలో విడుదల అవుతుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నియమాలు అన్ని బ్యాంకులలో ఒకే విధంగా వర్తించనున్నాయి.

ఖాతాదారులకు ఈజీ నామినీ సెటప్ :
ఈ కొత్త మార్పులు బ్యాంకింగ్ న్యాయ (సవరణ) చట్టం 2025లో భాగంగా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1955, 1970, 1980 నాటి బ్యాంకింగ్ కంపెనీల (సముపార్జన, ట్రాన్స్‌ఫర్ అండర్‌టేకింగ్‌లు) చట్టాలతో సహా అనేక చట్టాల నిబంధనలు మారనున్నాయి. ఈ కొత్త నిబంధనలతో బ్యాంకు ఖాతాదారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఇకపై బ్యాంకు అకౌంటుకు కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులను నామినీలుగా చేర్చుకోవచ్చు.