×
Ad

Bolero Facelift Vs Old Bolero : కొత్త కారు కొంటున్నారా? మహీంద్రా బొలెరో ఫేస్‌లిఫ్ట్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. పాత బొలెరో కన్నా బెటరా? ధర ఎంతంటే?

Bolero Facelift Vs Old Bolero : మహీంద్రా ఫేస్‌లిఫ్టెడ్ బొలెరో వేరియంట్ తక్కువ ధరకే లాంచ్ అయింది. పాత vs కొత్త బొలెరో మధ్య తేడాలంటో చూద్దాం..

Bolero Facelift Vs Old Bolero

Bolero Facelift Vs Old Bolero : కొత్త కారు కొంటున్నారా? భారత మార్కెట్లోకి మహీంద్రా నుంచి కొత్త బొలెరో వచ్చేసింది. భారతీయ వినియోగదారుల కోసం మహీంద్రా అప్‌డేట్ వేరియంట్ బొలెరో ఫేస్‌లిఫ్ట్ రీలాంచ్ చేసింది. అత్యంత పాపులర్ ఎస్‌యూవీ కార్లలో మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌ ఒకటి. ఈ కారులో మార్పులు కాస్మెటిక్‌గా ఉంటాయి. మెకానికల్ సెటప్, కోర్ క్యారెక్టర్ అలాగే ఉన్నాయి.

అయితే, డిజైన్, ఫీచర్లు, ధర పరంగా కొన్ని మార్పులు ఉన్నాయి. కొత్త బొలెరో రేంజ్ బేస్ B4 వేరియంట్ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్-స్పెక్ B8 ధర రూ.9.69 లక్షల వరకు ఉంటుంది. పాత బొలెరో లైనప్‌తో పోలిస్తే.. ధర రూ.8.79 లక్షల నుంచి రూ.9.78 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. వాస్తవానికి SUV ఎంట్రీ ధరను మహీంద్రా తగ్గించింది. అన్ని వేరియంట్లలో మరిన్ని ఫీచర్లను అందిస్తోంది.

కొత్త బొలెరో ధరలు (ఎక్స్-షోరూమ్) :
B4 : రూ. 7.99 లక్షలు
B6 : రూ. 8.69 లక్షలు
B6(O) : రూ. 9.09 లక్షలు
B8 : రూ. 9.69 లక్షలు

Read Also : Redmi Note 14 Pro Plus : ఇది కదా డిస్కౌంట్ అంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్.. త్వరగా కొనేసుకోండి!

పాత బొలెరో ధరలు (ఎక్స్-షోరూమ్)
B4 : రూ. 8.79 లక్షలు
B6 : రూ. 8.95 లక్షలు
B6(O) : రూ. 9.78 లక్షలు

బయటి వైపు పరిశీలిస్తే.. కొత్త బొలెరోలో అడ్జెస్టెడ్ గ్రిల్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లు, హై వేరియంట్‌లలో కొత్త డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కొత్త కలర్ ఆప్షన్, స్టెల్త్ బ్లాక్, డైమండ్ వైట్, DSAT సిల్వర్, రాకీ బీజ్ షేడ్స్‌లతో వస్తుంది. ఈ SUV కారు ఇప్పుడు అద్భుతమైన ఫీచర్లతో మరింత ఆకట్టుకునేలా ఉంది.

లోపల, మహీంద్రా క్యాబిన్‌ 17.8 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, టాప్ B8 ట్రిమ్‌లో లెథరెట్ అప్హోల్స్టరీతో అప్‌గ్రేడ్ చేసింది. B6, B6(O) వేరియంట్‌లు ఇప్పుడు పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, డిజిటల్ క్లస్టర్ వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది.

రైడ్‌ఫ్లో టెక్నాలజీగా బ్రాండ్ కొత్త సస్పెన్షన్ సెటప్, కఠినమైన భూభాగాలపై మెరుగైన రైడింగ్, స్టేబిలిటీని అందిస్తుంది. ఈ అప్‌డేట్స్ ఉన్నప్పటికీ బొలెరో అదే 1.5-లీటర్ mHAWK75 డీజిల్ ఇంజిన్‌ కలిగి ఉంది. 76hp, 210Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

మహీంద్రా కొత్త టాప్ వేరియంట్ B8 కూడా వచ్చి చేరింది. మునుపటి B6(O) కన్నా కిర్రాక్ ఫీచర్లు కలిగి ఉంది. డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, లెథరెట్ సీట్లు, ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లతో వస్తుంది.