Redmi Note 14 Pro Plus : ఇది కదా డిస్కౌంట్ అంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్.. త్వరగా కొనేసుకోండి!
Redmi Note 14 Pro Plus : రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ సందర్భంగా భారీ తగ్గింపు ధరకే కొనేసుకోవచ్చు

Redmi Note 14 Pro Plus
Redmi Note 14 Pro Plus : ఆఫర్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మిస్ అయితే ఇది మీకోసమే.. కొత్త స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డీల్స్ పొందొచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ధమాకా సేల్ అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది.
తద్వారా రూ.27వేల లోపు ధరకే (Redmi Note 14 Pro Plus) కొనేసుకోవచ్చు. ఈ రెడ్‌మి ఫోన్ 8GB ర్యామ్, 256 GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ రూ.34,999 ధరకు లాంచ్ యింది. ట్రిపుల్ కెమెరా, అద్భుతమైన పర్ఫార్మెన్స్, ప్రీమియం డిజైన్, ఏఐ ఫీచర్లతో వస్తుంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో+ డీల్ :
ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర రూ.26,987కు లభిస్తుంది. లాంచ్ ధర కన్నా రూ.8,012 తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.750 తగ్గింపును పొందవచ్చు. తద్వారా అసలు ధర రూ.34,999 నుంచి రూ.26,237 వరకు తగ్గుతుంది. వినియోగదారులు నెలకు రూ.949 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. పాత ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. డివైజ్ వర్కింగ్ కండిషన్, మోడల్ ఆధారంగా రూ.20,440 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు.
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ IP66 + IP68 + IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పవర్‌ఫుల్ 6.67-అంగుళాల 1.5K OLED ప్యానెల్ కలిగి ఉంది. ఈ రెడ్‌మి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా కూడా ప్రొటెక్షన్ అందిస్తుంది. 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
బ్యాటరీ బ్యాకప్ సమస్య కాదు.. ఎందుకంటే 90W ఛార్జింగ్‌తో భారీ 6,200mAh బ్యాటరీ కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 50MP మెయిన్, 8MP అల్ట్రావైడ్, 50MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 20MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.