×
Ad

Mahindra Scorpio N Facelift : వారెవ్వా.. కొత్త స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. లగ్జరీ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Mahindra Scorpio N Facelift : మహీంద్రా స్కార్పియో-ఎన్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ రిలీజ్ కానుంది. కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ మోడల్ కొన్ని ఫొటోలు రివీల్ అయ్యాయి. కొత్త ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

Mahindra Scorpio N Facelift

Mahindra Scorpio N Facelift : దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ, మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్లో అనేక పాపులర్ ఎస్‌యూవీలను అందిస్తోంది. ఈ ఎస్‌యూవీలలో మహీంద్రా స్కార్పియో ఎన్ ఒకటి. అత్యంత పాపులర్ మోడల్ కార్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఇదొకటి.

ఇప్పుడు, కంపెనీ మహీంద్రా స్కార్పియో ఎన్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ లాంచ్ చేయబోతోంది. కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ మోడల్ కొన్ని ఫొటోలు రివీల్ అయ్యాయి. మహీంద్రా స్కార్పియోలో కొత్త ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్ :
కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫ్రంట్ ఫేస్‌లిఫ్ట్‌ మరింత మెరుగుపరుస్తోంది. ఇందులో కొత్త రేడియేటర్ గ్రిల్ ఉంటుంది. ప్రస్తుత వెర్షన్ వర్టికల్ స్లాట్‌లకు బదులుగా కర్వడ్ స్లాట్‌లతో రానుంది. ఎస్‌యూవీ కొత్తగా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ఉండొచ్చు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ :
కొత్త స్కార్పియో-ఎన్ లోపలి భాగంలో కూడా అనేక మార్పులు ఉంటాయి. ఫస్ట్ టైమ్ డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో అందిస్తుందని భావిస్తున్నారు. క్యాబిన్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ డిజైన్‌ మహీంద్రా థార్ రాక్ మాదిరిగా ఉండొచ్చు. కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానుంది. ఏసీ వెంట్స్ రీపోజిషన్‌ కూడా ఉండొచ్చు.

Read Also : Vivo T4 Pro : వివో అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో T4 ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు :
కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ అనేక సేఫ్టీ ఫీచర్లతో రానుంది. ఇందులో 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా ఉండవచ్చు. ఈ ఎస్‌యూవీ లెవెల్-2 అడాస్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. డ్రైవింగ్‌ మరింత సేఫ్టీగా ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ :
కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో పవర్‌ఫుల్ ఇంజన్లు ఉంటాయని భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంజన్‌, గేర్‌బాక్స్ ఆప్షన్లు, పవర్, టార్క్ అవుట్‌పుట్‌లు పాత డిజైన్‌తోనే వస్తాయని భావిస్తున్నారు.

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ.14 లక్షల నుంచి రూ.26లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చు. ఈ SUV కారు 2026 ఆగస్టు నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లగ్జరీ కార్లను ఇష్టపడేవారికి అద్భుతమైన కారు అని చెప్పొచ్చు.