Dec 1 New Rules : బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 కొత్త రూల్స్ అమల్లోకి.. LPG గ్యాస్, UPS, పెన్షన్లపై కీలక మార్పులివే.. ఆ సేవలు బంద్..!
Dec 1 New Rules : డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. ఎల్‌పీజీ గ్యాస్ ధరల నుంచి కొత్త ఏటీఎఫ్, బ్యాంకు సెలవుల వరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dec 1 New Rules
Dec 1 New Rules : వినియోగదారులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ నెల వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ఆర్థిక, బ్యాంకింగ్, వాహనాలు, గ్యాస్ సిలిండర్లు, డిజిటల్ సేవలపై ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి.
ఈ నెల ప్రారంభంలో వచ్చే ఈ మార్పులతో (Dec 1 New Rules) మీ జేబుపై భారం పడనున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరల నుంచి యూపీఎస్, ఈపీఎఫ్ఓ ఆధార్ సంబంధిత నిబంధనలు సహా అనేక సేవలు ఉన్నాయి. మీ బడ్జెట్, ప్లానింగ్ సకాలంలో నిర్ణయించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు :
ప్రతి నెల 1వ తేదీన LPG కమర్షియల్ సిలిండర్ల ధరలు సవరించారు. పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలు ఈరోజు 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ. 10 తగ్గించాయి. కొత్త ధర నేటి నుంచి అమల్లోకి వస్తుంది. అయితే, డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులేదు. చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన LPG గ్యాస్ ధరలను సవరిస్తాయి. కొత్త మార్పులు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఆధార్ సంబంధిత నిబంధనలు :
డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆధార్ కార్డులను ఆన్‌లైన్‌లో సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. తద్వారా మీరు పేరు, అడ్రస్, పుట్టిన తేదీ మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని రిజిస్టర్ చేయవచ్చు. ఈ అప్‌డేట్ ప్రక్రియ ద్వారా పాన్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ వంటి ప్రభుత్వ రికార్డులకు వ్యతిరేకంగా డేటాను వెరిఫై చేసుకోవచ్చు. యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్‌ను కూడా ప్రారంభించింది.
ట్రాఫిక్ వెహికల్ కొత్త రూల్స్ :
డిసెంబర్ 1 నుంచి అనేక రాష్ట్రాల్లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆన్‌లైన్ చలాన్ చెల్లింపులకు ఇప్పుడు అదనపు ప్రాసెసింగ్ రుసుములు విధిస్తారు. PUC సర్టిఫికేట్ లేకపోవడం కూడా భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈపీఎఫ్ఓ :
డిసెంబర్ 1 నుంచి కొత్త ఈపీఎఓ రూల్స్ అమలులోకి వచ్చాయి. EPFO అనేక కొత్త మార్పులను తీసుకొచ్చింది. ఇందులో UAN-KYC లింకింగ్, ఇ-నామినేషన్, నెలవారీ పెన్షన్ అప్‌డేట్స్ నిబంధనల్లో మార్పులు ఉన్నాయి. నామినేషన్లను పూర్తి చేయడంలో విఫలమైన ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.
UPS గడువు పొడిగింపు లేదు :
డిసెంబర్ 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇకపై NPS నుంచి UPS మధ్య ఎంచుకునే అవకాశం ఉండదు. యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని ఎంచుకోవడానికి గడువును సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 30 వరకు పొడిగించారు. ఇకపై ఈ గడువు తేదీని పొడిగించలేదు. ఈ రోజు నుంచి ఏ ప్రభుత్వ ఉద్యోగి NPS నుంచి UPSకి మారలేరు. ఒకవేళ గడువు పొడిగిస్తే మళ్లీ అవకాశం ఉండవచ్చు.
లైఫ్ సర్టిఫికేట్ :
ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా పెన్షన్లు పొందవచ్చు. నవంబర్ 30 లోపు లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం గడువును పొడిగించలేదు. పెన్షనర్లు డిసెంబర్ 1 నుంచి తమ లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్లను సమర్పించలేరు. వాస్తవానికి, గడువు సాధారణంగా ప్రతి ఏడాది నవంబర్ 30 వరకు ఉంటుంది. మీరు ఇప్పటి వరకు మీ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మీ పెన్షన్ నిలిచిపోతుంది.
ఆదాయపు పన్ను దాఖలు గడువు :
నవంబర్ 30 అనేది పన్ను చెల్లింపుదారులకు కూడా కీలకమైన గడువు. అక్టోబర్‌లో మినహాయించిన పన్ను కోసం TDS స్టేట్‌మెంట్‌లను (సెక్షన్లు 194-IA, 194-IB, 194M, 194S కింద) సమర్పించేందుకు చివరి తేదీ. అదనంగా, సెక్షన్ 92E ప్రాసెస్ చేసేందుకు ఈ తేదీలోపు పన్నుచెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేయాలి.
భారత్‌లో పనిచేస్తున్న విదేశీ కంపెనీల అనుబంధ సంస్థలు ఫారమ్ 3CEAAను సమర్పించాలి. ఈ గడువులను దాటితే నోటీసులు, పెనాల్టీలను చెల్లించాలి. ఆన్‌లైన్ సేవలు, GST నిబంధనలలో మార్పులతో ఈ-కామర్స్ చిరువ్యాపారాలకు GST సవరించారు. GSTR-1 3B ఫైలింగ్ కోసం కొత్త క్యాలెండర్ అమల్లోకి వస్తుంది. అనేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త TCS/TDS రేట్లు వర్తిస్తాయి.
19 బ్యాంకు సెలవులు :
డిసెంబర్‌లో రెండో, నాల్గో శనివారాలు, ఆదివారం వారతంపు సెలవుతో సహా మొత్తం 19 సెలవులు ఉంటాయి. ఆర్బీఐ బ్యాంకు సెలవుల జాబితా ప్రకారం.. రాష్ట్రాన్ని బట్టి సెలవులు మారుతూ ఉంటాయి. ప్రతి రాష్ట్రంలోని బ్యాంకులు 19 రోజులు మూతపడతాయి.
అందువల్ల, బ్యాంకింగ్ పని కోసం ఇంటి నుంచి బయలుదేరే ముందు మీ నగరంలోని బ్యాంకు ఓపెన్ చేసి ఉందో లేదో చెక్ చేయండి. నెల సెలవుతో ప్రారంభమవుతుంది. కానీ, ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్‌లో మాత్రమే బ్యాంకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 25న దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి.
కొత్త ATF రేట్లు :
డిసెంబర్ 1వ తేదీ ఉదయం ఇండియన్ ఆయిల్ కొత్త ATF రేట్లను లాంచ్ చేసింది. ఈరోజు నుంచి అమలులోకి వస్తుంది. ఢిల్లీలో ఎయిర్ టర్బైన్ ఫ్యూయిల్ (ATF) రేటు కిలోలీటర్‌కు 864.81డాలర్లకి మారింది. ఇంకా, కోల్‌కతాలో కిలోలీటర్‌కు 903.10 డాలర్లు, ముంబైలో కిలోలీటర్‌కు 864.35 డాలర్లు, చెన్నైలో కిలోలీటర్‌కు 859.89 డాలర్లగా ఉంది.
