Nothing Phone 2 Launch : సూపర్ ఫీచర్లతో నథింగ్ ఫోన్ (2) వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Nothing Phone 2 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? నథింగ్ (2) ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ డిజైన్‌లో కొన్ని సరైన అప్‌గ్రేడ్‌లతో అందిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (2) కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Nothing Phone 2 is official, launched in India with price starting at Rs 44,999

Nothing Phone 2 Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ నథింగ్ ఫోన్ (2) గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. నథింగ్ ఫోన్ (1) సక్సెసర్ బేస్ మోడల్ నథింగ్ ఫోన్ (2) మోడల్ (8GB RAM + 128GB) మెమరీతో వస్తుంది. అయితే, టాప్-ఎండ్ మోడల్ (12GB RAM + 512GB) ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (2) మోడల్ అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (1) సక్సెస్ కావడంతో నథింగ్ ఫోన్ (2) డిజైన్‌లో కొన్ని సరైన అప్‌గ్రేడ్‌లను, హార్డ్‌వేర్ ముందు కొన్ని ప్రధాన అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.

నథింగ్ ఫోన్ (2) లాంచ్ చేయగా, గత ఏడాదిలో నథింగ్ ఫోన్ (1) కస్టమర్‌లపై దృష్టిసారిస్తుంది.  ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1) భారత మార్కెట్లో దాదాపు రూ. 30వేల వద్ద అందుబాటులో ఉండగా, నథింగ్ ఫోన్ (2) రూ. 40వేల మార్కును దాటింది. నథింగ్ ఫోన్ (2) వేరియంట్లు, ధరలను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : Nothing Smartwatch : నథింగ్ ఫోన్ (2) తర్వాత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌వాచ్‌ వచ్చేస్తోంది.. టిప్‌స్టర్ హింట్ ఇదిగో..!

భారత్‌లో నథింగ్ ఫోన్ (2) ధర ఎంతంటే? :
నథింగ్ ఫోన్ (2) మూడు వేరియంట్‌లలో 8GB RAM + 128GB స్టోరేజీ, 12GB RAM + 256GB స్టోరేజీ, 12GB RAM + 512GB స్టోరేజీ కలిగి ఉంది. ధర విషయానికొస్తే.. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ. 44,999, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ రూ. 49,999, 12GB RAM + 512GB స్టోరేజ్ రూ. 54,999తో వచ్చింది.

నథింగ్ ఫోన్ (2) సేల్ డేట్, ఆఫర్లు ఇవే :
నథింగ్ ఫోన్ (2) భారత మార్కెట్లో శుక్రవారం, జూలై 21, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా ఓపెన్ సేల్ అందుబాటులో ఉండనుంది.

Nothing Phone 2 is official, launched in India with price starting at Rs 44,999

నథింగ్ ఫోన్ (2) స్పెసిఫికేషన్లు :
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. నథింగ్ ఫోన్ (2) మోడల్ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో పాటు 12GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. సాఫ్ట్‌వేర్ వైపు ఫోన్ (Android 13OS) ఆధారంగా కొత్త NothingOS 2.0 పై రన్ అవుతుంది.

నథింగ్ ఫోన్ (2) 1080 — 2412 రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కెమెరాల విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ (2) 50MP సోనీ IMX890 సెన్సార్ + 50MP Samsung JN1 సెన్సార్‌తో పాటు మెరుగైన ట్యూనింగ్, కెమెరా ఫీచర్లతో పాటు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో నథింగ్ ఫోన్ (2) సోనీ IMX615 సెన్సార్ ఆధారంగా 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

నథింగ్ ఫోన్ (2) బ్యాటరీ లైఫ్ పరంగా అప్‌గ్రేడ్‌తో వస్తుంది. నథింగ్ ఫోన్ (1)తో పోల్చినప్పుడు పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 4700mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్, USB టైప్ C పోర్ట్‌కు సపోర్టు అందిస్తుంది. రిటైల్ బాక్స్ పారదర్శక నథింగ్ బ్రాండెడ్ కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఫోన్‌తో వస్తుంది. బాక్సులో ఛార్జింగ్ ఆప్షన్ కూడా అందిస్తుంది.

Read Also : Nothing Phone 2 Pre-order : ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (2) ప్రీ-ఆర్డర్ మొదలైందోచ్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!

ట్రెండింగ్ వార్తలు