Ola BOSS discounts : ఓలా ఎలక్ట్రిక్ పండుగ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఆ స్కూటర్ ధరలో మార్పు లేదు!

Ola BOSS Discounts : ఓలా ఎస్1 ఎక్స్ 2KWh ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్ ప్రకటించినట్టుగా కంపెనీ పేర్కొంది. ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే రూ.25వేల వరకు అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Ola clarifies on BOSS discounts ( Image Source : Google )

Ola BOSS Discounts : ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ పండుగ డిస్కౌంట్ (బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్) ప్రకటించింది. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్ కేవలం లిమిటెడ్ పిరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటుందని ఓలా స్పష్టంచేసింది. కస్టమర్లందరికి 5వేలు డిస్కౌంట్, ఎంపిక చేసిన వారికి రూ.25వేల వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్ అందించనున్నట్టు పేర్కొంది.

అది కూడా కంపెనీలో స్టాక్ పూర్తి అయ్యేవరకు మాత్రమేనని తెలిపింది. ఈ పండుగ ఆఫర్ సమయంలో ఓలా ఎస్1 ఎక్స్ 2KWh ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్ ప్రకటించినట్టుగా కంపెనీ పేర్కొంది. దాంతో ఓలా స్టాక్ 3శాతం పడిపోయిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఓలా ఎలక్ట్రిక్.. ఆ డిస్కౌంట్ లిమిటెడ్ ఫెస్టివల్ ఆఫర్ అని, ఆ స్కూటర్ అధికారిక ధరలో ఎలాంటి మార్పులేదని వివరణ ఇచ్చింది.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కి లేఖ రాయగా.. ఓలా ఎలక్ట్రిక్ డిస్కౌంట్ విషయంపై స్పందించింది. పండుగ సమయంలో అందరి కస్టమర్లకు రూ.5వేల డిస్కౌంట్ ఇస్తామని ధృవీకరించింది. అందులో కూడా ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే రూ.25వేల వరకు అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అది కూడా ఆ స్టాక్ అయిపోయే వరకు మాత్రమే అని వివరించింది.

“మేం ఓలా ఎస్1 ఎక్స్ 2KWh ధర మార్చలేదు. కొద్దికాలం పాటు ఫెస్టివల్ ప్రమోషన్ నిర్వహిస్తున్నాం. ప్రతి కస్టమర్‌కి రూ.5వేలు సాధారణ డిస్కౌంట్ అందిస్తున్నాం. కొంతమంది కస్టమర్లకు రూ.25వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. కానీ, అది పరిమిత స్టాక్‌పై మాత్రమే వర్తిస్తుందని ఓలా స్పష్టం చేసింది.

ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎక్స్ 2KWh మోడల్ ధర రూ.49,999కి విక్రయిస్తున్నారా? అంటే.. దానిపై స్పందించిన ఓలా ఆ స్కూటర్ ధరలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. అయితే, రూ.25వేల డిస్కౌంట్ ఆఫర్ కేవలం పరిమిత స్టాక్‌కు వర్తిస్తుందని తెలిపింది. అంతేకానీ, స్కూటర్ ధరలో మార్పులేదని ప్రకటించింది. గరిష్ట డిస్కౌంట్ రుజువుగా అక్టోబర్ 6, 2024 నాటి ఇన్వాయిస్‌‌ను ఓలా ఏఆర్ఏఐకి సమర్పించింది.

Read Also : Infinix Inbook Air Pro Plus : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? అద్భుతమైన ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ఇన్‌బుక్ ఎయిర్‌ప్రో ప్లస్ వచ్చేసింది.. ధర ఎంతంటే?