Ola Electric confirms to refund charger money to eligible customers
Ola Electric Offer : భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ (Electric Vehicles) వినియోగం భారీగా పెరిగింది. ఇందన ధరల పెరుగుదలతో పాటు తీవ్రమైన పొల్యూషన్ వంటి నివారించేందుకు ప్రతిఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈవీ వాహనాలకు పెరిగిన డిమాండ్‌తో ఈవీ తయారీదారులు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లను గుప్పిస్తున్నారు. అప్పటినుంచి దేశ ఈవీ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఓలా స్కూటర్లకు కూడా మార్కెట్లో భారీగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది.
అద్భుతమైన ఫీచర్లు, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం మన్నికగా ఉండటం, తక్కువ ఖర్చులోనే ఎక్కువ దూరం ప్రయాణం చేయొచ్చు. అందుకే ఓలా స్కూటర్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ తమ కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు ఇటీవల సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఓలా బైక్ కొనుగోలు చేసిన సమయంలో ఛార్జర్ కోసం చెల్లించిన ధర మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేసేస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈవీ దిగ్గజం ఓలా ట్విటర్‌లో వేదికగా ఒక ప్రకటనలో తెలిపింది.
అర్హులైన ఓలా కస్టమర్లకే రీఫండ్ చేస్తాం :
అంతేకాదు.. ఇటీవలి సంవత్సరాలలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో విశేషమైన వృద్ధిని సాధించిందని కంపెనీ పేర్కొంది. ఛార్జర్ ధరలకు సంబంధించి ఇటీవలి ఓలా ఎలక్ట్రిక్ చర్చలు జరిపింది. ఇది పరిశ్రమలో కొంత చర్చనీయాంశమైంది. ఈవీ పరిశ్రమలో అగ్రగామిగా వినియోగదారులకు మొదటి స్థానం ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని కంపెనీ తెలిపింది. అందుకే.. అర్హులైన ఓలా కస్టమర్లందరికీ ఛార్జర్ డబ్బులను తిరిగి చెల్లించాలని నిర్ణయించుకున్నామని కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రకటన ప్రకారం.. ఈ నిర్ణయం ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వాహన విప్లవం పట్ల అంకితభావాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వినియోగదారులకు ఓలాపై మరింత విశ్వాసాన్ని విలువను పెంచనుంది. ఓలా ఎలక్ట్రిక్ ఛార్జర్‌లపై రీయింబర్స్ చేయాలనుకుంటున్న కచ్చితమైన మొత్తాన్ని ఓలా ప్రకటనలో వెల్లడించలేదు.
Ola Electric Offer confirms to refund charger money to eligible customers
ఓలా చెల్లించాల్సిన రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని సుమారు రూ. 130 కోట్లుగా ప్రభుత్వ అధికారులు అంచనా వేసినట్టు నివేదిక తెలిపింది. TVS మోటార్ కంపెనీ ఇటీవల FAME స్కీమ్ కింద నిర్ణీత థ్రెషోల్డ్ లిమిట్ కన్నా ఎక్కువ చెల్లించిన కస్టమర్‌లకు సుమారు రూ. 20 కోట్లను రీఫండ్ చేస్తూ గుడ్‌విల్ బెనిఫిట్ స్కీమ్ అందించనున్నట్లు ప్రకటించింది. ఇటీవలే FAME-II స్కీమ్ కింద స్థానికీకరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారత ప్రభుత్వం ఒకినావా ఆటోటెక్, హీరో ఎలక్ట్రిక్‌లకు నోటీసులు జారీ చేసింది. FY20 ఆర్థిక సంవత్సరం నుంచి క్లెయిమ్ చేసిన ప్రోత్సాహకాలను తిరిగి పొందాలని కంపెనీ అభ్యర్థించింది.
అనామక ఇమెయిల్‌ల ఆధారంగా 2020, 2021కి సంబంధించిన ఆడిట్‌లు మళ్లీ ఓపెన్ అయ్యాయి. చాలా కంపెనీలు భారత మార్కెట్లో తయారు చేయని కొన్ని భాగాలను దిగుమతి చేసుకుంటున్నాయని వెల్లడించింది. భారత మార్కెట్లో (హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం, తయారు చేయడం) అనే (FAME II) స్కీమ్ ఏప్రిల్ 1, 2019న ప్రారంభమైంది. ఈ స్కీమ్ మూడేళ్ల కాలానికి.. మార్చి 31, 2024 వరకు మరో రెండేళ్లపాటు పొడిగించింది. మొత్తం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ (e-3W), ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ (e-4W), ఎలక్ట్రిక్ బస్సుల విభాగాల్లో ప్రజా, వాణిజ్య రవాణాపై దృష్టి సారించి FAME స్కీమ్ II ఫేజ్ II కోసం రూ. 10వేల కోట్లు కేటాయించినట్టు నివేదిక తెలిపింది.
Important Update. pic.twitter.com/G0GM46UApM
— Ola Electric (@OlaElectric) May 4, 2023
కేంద్రం జోక్యంతో రీఫండ్ నిర్ణయం :
కేంద్ర ప్రభుత్వం ఈవీ కంపెనీలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓలా ఎలక్ట్రిక్ తమ వినియోగదారులకు ఛార్జర్ డబ్బులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. అప్పుడు మాత్రమే ఓలాకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సబ్సిడీలు అందనున్నాయి. ఓలా తమ కస్టమర్లకు ఛార్జర్‌ను యాడ్ ఆన్ సర్వీసు కింద మాత్రమే ఇచ్చింది. అందులో ఛార్జర్ ధరను మాత్రం ఓలా బైక్ కొనుగోలు ధరలో కలపలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఛార్జర్ సపరేటుగా అమ్మితే సబ్సిడీ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దాంతో వేరే గత్యంతరం లేక ఓలా ఛార్జర్ కొనుగోలు చేసిన ఓలా కస్టమర్ల అందరికి ఛార్జర్ డబ్బులను తిరి ఇవ్వాలని నిర్ణయించింది. ఓలా బైక్ మోడల్స్ ఆధారంగా కస్టమర్లకు రూ. 9 వేల నుంచి రూ.19 వేల వరకు డబ్బులను తిరిగి ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
100 Hyperchargers. Coming soon. In Bengaluru. Nuff said.#GoAnywhereGoEverywhere#EndICEage
(keep sound on?) pic.twitter.com/RGIvd09JxG
— Ola Electric (@OlaElectric) April 20, 2023
లక్షలాది కస్టమర్లకు ఛార్జర్ రీఫండ్ :
దేశవ్యాప్తంగా ఓలా కస్టమర్లలో దాదాపు లక్ష మంది ఓలా ఛార్జర్లు సపరేటుగా డబ్బులు చెల్లించి తీసుకున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ ధరతో కాకుండా విడిగా కొనుగోలు చేశారు. ఇదే విషయాన్ని ఓలా కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఆయా కస్టమర్లు అందరికి ఛార్జర్ డబ్బులు తిరిగి ఇస్తున్నామని తెలిపింది. 2023 ఏడాది మార్చి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు చార్జర్ కూడా విక్రయిస్తున్నామని ఓలా ఎలక్ట్రిక్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. అయితే, ప్రభుత్వ అధికారులు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని సుమారు రూ. 130 కోట్లుగా ఉండొచ్చునని అంచనా వేసినట్లు గత నివేదికలు సూచించాయి.