Ola Electric MoveOS 5 : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో MoveOS 5 కొత్త ఫీచర్లు.. దేశవ్యాప్తంగా 4వేల స్టోర్లు..!

Ola Electric MoveOS 5 : ఓలా (MoveOS 5)తో అందుబాటులో ఉన్న కొన్ని ఫీచర్ల గురించి కంపెనీ వివరాలను రివీల్ చేసింది. ఇందులో గ్రూప్ నావిగేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, ఓలా మ్యాప్స్ ద్వారా రోడ్ ట్రిప్ మోడ్ ఉన్నాయి.

Ola Electric 4k Stores

Ola Electric MoveOS 5 : దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీలలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం (MoveOS 5) బీటాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ S1 ఎలక్ట్రిక్ స్కూటర్లలో (MoveOS) ఆపరేటింగ్ సిస్టమ్‌గా అందిస్తోంది. అదే ఆపరేటింగ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో కూడా ఉపయోగిస్తోంది.

ఓలా (MoveOS 5)తో అందుబాటులో ఉన్న కొన్ని ఫీచర్ల గురించి కంపెనీ వివరాలను రివీల్ చేసింది. ఇందులో గ్రూప్ నావిగేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, ఓలా మ్యాప్స్ ద్వారా రోడ్ ట్రిప్ మోడ్ ఉన్నాయి. అంతేకాకుండా, స్మార్ట్ ఛార్జింగ్, స్మార్ట్ పార్క్, టీపీఎంఎస్ అలర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. (Krutrim AI) అసిస్టెంట్ ఈ ఫీచర్ల వినియోగంలో సాయం చేస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ బుధవారం (డిసెంబర్ 25) నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 4,000 స్టోర్‌లకు విస్తరించింది. ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్ కన్నా నాలుగు రెట్లు పెరిగింది. కంపెనీ 3,200కి పైగా కొత్త స్టోర్‌లను సర్వీసు సౌకర్యాలతో కలిసి ప్రారంభించింది. ఈ విస్తరణ మెట్రోలు, టైర్ I, II నగరాలను దాటి చిన్న పట్టణాలు, తహసీల్‌లుగా విస్తరించి ఉందని ఓలా ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది.

“కొత్తగా ఓపెన్ చేసిన మా స్టోర్‌లు సర్వీస్ సెంటర్‌లతో కలిసి ఈవీ కొనుగోలు, యాజమాన్య అనుభవాన్ని పూర్తిగా పునర్నిర్వచించాం. మా #SavingsWalaScooter ప్రచారంతో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసాం” అని ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ తెలిపారు.

మూవీస్ 5 బీటా :
కంపెనీ (MoveOS 5) బీటా కోసం రిజిస్ట్రేషన్‌ను కూడా ప్రారంభించింది. మొత్తం రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని ఓలా తెలిపింది. ఈ ఫీచర్‌లో గ్రూప్ నావిగేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, స్మార్ట్ ఛార్జింగ్, స్మార్ట్ పార్క్ మరిన్ని ఉంటాయి. అదనంగా, ఓలా మ్యాప్స్, టీపీఎంఎస్ అలర్ట్‌లో రన్ అయ్యే రోడ్ ట్రిప్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది.

Ola Electric Launches 4k Stores

ఓలా ఎస్1 ప్రో సోనా :
ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల ఓలా ఎస్1 ప్రో సోనా ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ పరిమిత ఎడిషన్ యూనిట్ 24-క్యారెట్ బంగారు పూతతో కూడిన ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది. దాంతో ఓలా యాప్ ఇంటర్‌ఫేస్ గోల్డ్ బ్యాక్‌గ్రౌండ్ ఇంటర్‌ఫేస్ కస్టమైజడ్ మూవ్OS డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. రైడ్ మోడ్‌లు, సెట్టింగ్‌లను పర్సనలైజడ్ రైడర్‌లను అనుమతిస్తుంది.

ఓలా S1 జెడ్, ఎస్1 Z+ :
ఓలా S1 జెడ్, ఓలా S1Z+ ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఓలా ఎస్1 జెడ్ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఆఫర్‌లో స్వాప్ చేయగల బ్యాటరీని కలిగి ఉంది. రెండు 1.5kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. క్లెయిమ్ చేసిన 149km పరిధిని కలిగి ఉంది. ఓలా ఎస్1 జెడ్ టాప్ స్పీడ్ గంటకు 70కి.మీ గరిష్ట వేగాన్ని కలిగి ఉంది.

ఓలా S1 గిగ్, గిగ్ ప్లస్ :
ఓలా ఎలక్ట్రిక్ కమర్షియల్ విభాగం కోసం రెండు ఈవీ స్కూటర్లను కూడా విడుదల చేసింది. స్వాప్ చేయగల బ్యాటరీలతో ఓలా గిగ్, గిగ్+లను ప్రవేశపెట్టింది. గిగ్ అనేది ఎంట్రీ-లెవల్ స్కూటర్, సరళమైన డిజైన్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, తగిన పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కంపెనీ దీనిని బీ2బీ కొనుగోళ్లు, రెంట్ల కోసం అందిస్తుంది.

Read Also : Oppo A5 Pro 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీతో ఒప్పో A5 ప్రో 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే!