Ola Roadster X series : కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా? ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ వచ్చేసింది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర కేవలం రూ. 74,999 మాత్రమే!
Ola Roadster X Electric Bike: ఓలా రోడ్‌స్టర్ X సిరీస్‌లో రోడ్‌స్టర్ X (2.5kWh, 3.5kWh, 4.5kWh), రోడ్‌స్టర్ X+ 4.5kWh, రోడ్‌స్టర్ X+ 9.1kWh వేరియంంట్లు ఉన్నాయి. ధర ఎంతంటే?

Ola Roadster X series of electric motorcycles launched
Ola Roadster X series : కొత్త ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. భారత ఎలక్ట్రిక్ టూవీలర్స్ విభాగంలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తయారీదారు సరికొత్త ఎలక్ట్రిక్ బైకును ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కోసం వినియోగదారులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కొత్త మోడల్ పేరు ఏంటో తెలుసా?
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ (Ola Roadster X) బైక్.. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్.. పెట్రోల్ బైక్స్‌కు గట్టి పోటినిచ్చేలా ఉంది. దేశ మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ బైకులకు ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. డిమాండ్ అనుగుణంగా ఓలా ఎలక్ట్రిక్ ఈ సరికొత్త మోడల్ రిలీజ్ చేసి వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
కంపెనీ స్కేలబుల్ మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్‌ను కేవలం రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు అందిస్తోంది. రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్‌లో రోడ్‌స్టర్ ఎక్స్ (2.5kWh, 3.5kWh, 4.5kWh), రోడ్‌స్టర్ X+ 4.5kWh, రోడ్‌స్టర్ X+ 9.1kWh ఉన్నాయి. ఈ మోడల్ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.
* రోడ్‌స్టర్ X 2.5kWh – రూ. 74,999
* రోడ్‌స్టర్ X 3.5kWh – రూ. 84,999
* రోడ్‌స్టర్ X 4.5kWh – రూ. 94,999
* రోడ్‌స్టర్ X+ 4.5kWh – రూ. 1,04,999
* రోడ్‌స్టర్ X+ 9.1kWh – రూ. 1,54,999
ఓలా రోడ్‌స్టర్ X మోడల్ బైక్ సింగిల్ ఛార్జ్‌తో 200కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. అంతేకాదు.. మొత్తం 3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఓలా బేస్ వేరియంట్ 2.5 kWh బ్యాటరీతో వస్తుంది. ఫుల్ ఛార్జింగ్ చేస్తే మాత్రం ఈ బైక్ మోడల్ 140కిలోమీటర్ల వరకు దూసుకెళ్లగలదు. ఇందులో మరో స్పెక్ వేరియంట్ 3.5kWh బ్యాటరీతో వచ్చింది. ఈ బైకు ధర ధర రూ. 84,999 ఎక్స్-షోరూమ్ వద్ద లభ్యమవుతుంది.
ఓలా రోడ్‌స్టర్ X సిరీస్ బ్యాటరీ వేరియంట్లు :
ఈ మోడల్ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ చేస్తే.. 196 కిలోమీటర్లు దూసుకెళ్లగలదు. ఇదే మోడల్ టాప్ వేరియంట్ 4.5kWh బ్యాటరీతో రాగా, సింగిల్ ఛార్జ్‌తో 252 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ వేరియంట్ ధర రూ.95,999కు లభ్యమవుతుంది. ఈ మోడల్ బైకులతో పాటు ఓలా రోడ్‌స్టర్ X ప్లస్ అనే వెర్షన్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ ప్లస్ మోడల్ 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వచ్చింది. రోడ్‌స్టర్ X ప్లస్ మోడల్ 4.5kWh బ్యాటరీతో వచ్చింది.

Ola Roadster X series
ఈ మోడల్ ధర రూ.1.05 లక్షలు కాగా, సింగిల్ ఛార్జ్‌తో 252 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. 9.1kWh బ్యాటరీ కలిగిన బైకు ధర రూ.1.55 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ బైక్ ఫుల్ ఛార్జ్‌తో 501 కిలోమీటర్ల హై రేంజ్ అందిస్తుంది. ఈ కొత్త ఓలా ఎలక్ట్రిక్స్ బైకులలో దిమ్మతిరిగే ఫీచర్లు ఉన్నాయి. రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌లో నార్మల్, స్పోర్ట్స్, ఎకో అనే 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.
రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ వేరియంట్ బైకులో కూడా అడ్వాన్స్‌డ్ రీజెన్, రివర్స్ మోడ్, ఎనర్జీ ఇన్‌సైట్స్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ఇతర ఫీచర్లలో క్రూయిజ్ కంట్రోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, టీపీఎంఎస్, ఎల్‌సీడీ స్క్రీన్ కూడా ఉన్నాయి. రోడ్‌స్టర్ ఎక్స్ సిరీస్ మూడు ఏళ్లు లేదా 50వేల కిలోమీటర్ల ప్రామాణిక వారంటీతో వస్తుంది. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ 2.5kWh బ్యాటరీ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 105kmph, 3.5kWh వేరియంట్ గరిష్ట వేగం గంటకు 118kmph, ఎక్స్ ప్లస్ గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం :
రోడ్‌స్టర్ సిరీస్ సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ పేటెంట్ పొందిన బ్రేక్-బై-వైర్ టెక్నాలజీతో వస్తుంది. బ్యాటరీ IP67 సర్టిఫికేషన్ కలిగి ఉంది. వాటర్‌ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కూడా అందిస్తుంది. బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) సర్వీస్, రోడ్‌స్టర్ సిరీస్ డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ ఆప్టిమైజ్డ్ ఆప్షన్లను కలిగి ఉంది. డెలివరీలు మార్చి మధ్య నుంచి ప్రారంభం కానున్నాయి.