Upcoming Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ ఫిబ్రవరి నెలలో రాబోయే టాప్ 5 స్మార్ట్ఫోన్లు ఇవే.. గెట్ రెడీ..!
Upcoming Phones : షావోమీ, రియల్‌మి, వివో వంటి బ్రాండ్ల నుంచి ఫిబ్రవరి 2025లో లాంచ్ అయ్యే ఈ స్మార్ట్ఫోన్లను ఓసారి లుక్కేయండి.. పూర్తి వివరాల కోసం..

Upcoming Phones
Upcoming Phones 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? గత నెలలో అనేక సరికొత్త ఫోన్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి. మొబైల్ కంపెనీల నుంచి సరికొత్త ఫోన్లను లాంచ్ అయ్యాయి. ఇప్పుడు, ఫిబ్రవరి 2025లో కూడా అంతే స్థాయిలో కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరికొత్త మోడల్స్ కోసం ఔత్సాహికులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా సమయం ఆసన్నమైంది.
ఈ నెలలో ముఖ్యంగా భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ ప్రియులను మరింత ఆకట్టుకునేలా కొత్త మోడల్స్ రానున్నాయి. అందులో ప్రధానంగా వివో, ఐక్యూ, టెక్నో, షావోమీ, రియల్‌మి Realme వంటి బ్రాండ్ల నుంచి కొత్త ఫోన్లు మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఇంతకీ ఏయే మోడల్స్ ఫోన్లు రానున్నాయో ఓసారి లుక్కేయండి.
ఫిబ్రవరి 2025లో రాబోయే స్మార్ట్ఫోన్లు ఇవే :
వివో V50 సిరీస్ :
వివో V50 సిరీస్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో బహుశా వివో V50, వివో V50 ప్రో ఉంటాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్+ అమోల్డ్ డిస్ప్లే, మల్టీఫేస్ కెమెరా సిస్టమ్, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్లో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ లభిస్తాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకర్షణీయమైన వివో ఫోన్ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రోజంతా ఈ ఫోన్ వినియోగించవచ్చు.
ఐక్యూ నియో 10ఆర్ :
ఐక్యూ నియో 10ఆర్ అనేది పర్ఫార్మెన్స్ ఆధారిత మిడ్‌రేంజ్ ఫోన్‌గా రానుంది. పర్ఫార్మెన్స్ పరంగా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రూ. 30వేల కన్నా తక్కువ ధరలో ఫోన్ రానుంది. ఐక్యూ నియో 10ఆర్ ఫోన్ 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 600 సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ను అందించే డ్యూయల్-కెమెరా సెటప్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఐక్యూ 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 6400mAh బ్యాటరీని అందించనుంది. మీ ఫోన్ రోజంతా ఛార్జింగ్ ఉండేలా చేస్తుంది.
టెక్నో కర్వ్ :
టెక్నో కంపెనీ రాబోయే కర్వ్డ్- డిస్ప్లే స్మార్ట్‌ఫోన్‌తో రానుంది. అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను త్వరలో ఆవిష్కరించనుంది. ఐకానిక్ పోవా సిరీస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ రాబోయే స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ లైటింగ్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ లైటింగ్‌తో ఫ్యూచరిస్టిక్, త్రిభుజాకార ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను కూడా కంపెనీ అందించనుంది.
షావోమీ 15 సిరీస్ :
ఫ్లాగ్షిప్ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షావోమీ 15, షావోమీ 15 ప్రో ఫోన్లు ఈ ఫిబ్రవరిలో రానున్నాయి. అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతాయి. షావోమీ ఇండియా పర్ఫార్మెన్స్, కెమెరా సామర్థ్యాలతో మొత్తం యూజర్ అనుభవాన్ని అందించేలా ఈ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తోంది. అధికారిక లాంచ్‌ను కంపెనీ ఇంకా ధృవీకరించలేదని గమనించాలి. కానీ, లీక్‌ల ప్రకారం.. ఈ నెలలో స్మార్ట్ఫోన్లు లాంచ్ కావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
రియల్మీ నియో 7 :
ఫిబ్రవరిలో లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్.. పవర్ఫుల్ మీడియాటెక్ 9300 ప్లస్ చిప్సెట్, 16జీబీ ర్యామ్‌తో రానుంది. రియల్‌మి నియో 7 మృదువైన యూజర్ ఎక్స్పీరియన్స్ అందించనుంది. అంతేకాదు.. డిమాండ్ ఉన్న వినియోగదారులకు ఆకర్షణీయమైన ఫోన్ కూడా మారనుంది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో మరిన్ని ఫీచర్ల వివరాలు తెలిసే అవకాశం ఉంది.