Hyundai Cars : సూపర్ ఆఫర్ భయ్యా.. హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఈ నెలలో ఏ కారు కొంటే ఎంత డిస్కౌంట్ వస్తుందంటే?

Hyundai Cars : భారత మార్కెట్లో హ్యుందాయ్ కార్స్ కంపెనీ కొన్ని మోడల్ కార్లను డిస్కౌంట్ ధరలకే విక్రయిస్తోంది. ఏదైనా కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ నెలలో నాలుగు కార్లపై వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

Hyundai Cars : సూపర్ ఆఫర్ భయ్యా.. హ్యుందాయ్ కార్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఈ నెలలో ఏ కారు కొంటే ఎంత డిస్కౌంట్ వస్తుందంటే?

Hyundai Cars Get Discounts on These Model Cars

Updated On : February 4, 2025 / 4:28 PM IST

Hyundai Cars Discounts : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన అవకాశం. భారత మార్కెట్లో దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీ విభాగంలో అనేక కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తుంది.

Read Also : SSC JE Final Result 2025 : ఎస్ఎస్‌సీ జేఈ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయి.. షార్ట్‌లిస్ట్ లిస్టు, కటాఫ్ ఎంతంటే..? ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!

ఫిబ్రవరి 2025లో మొత్తం నాలుగు కార్లపై వేల రూపాయల తగ్గింపును కంపెనీ అందిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు రూ.68వేల వరకు తగ్గింపుతో పాటు మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నెలలో ఏ కారు మోడల్ కొనుగోలు చేస్తే ఎంత ఆదా చేయవచ్చు? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై రూ. 40వేలు డిస్కౌంట్ :
హ్యుందాయ్ ఎస్‌యూవీ ఎక్స్‌టార్‌పై ఆకర్షణీయమైన అందిస్తోంది. ఫిబ్రవరి 2025లో ఈ SUV మోడల్‌పై కంపెనీ వేల రూపాయల డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెలలో ఈ కారు కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ.40 వేలు ఆదా చేయవచ్చని సమాచారం. ఈ మోడల్‌ను i20, ఆరా మాదిరిగానే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. గరిష్టంగా 82bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ ఐ20పై రూ. 65వేలు డిస్కౌంట్ :
హ్యుందాయ్ ఐ20ని కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా లాంచ్ చేసింది. ఈ నెలలో ఈ ఎస్‌యూవీ (SUV)పై రూ.65 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ సేవింగ్ సాధారణ వెర్షన్‌లో మాత్రమే అందిస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ వెర్షన్‌పై ఎలాంటి డిస్కౌంట్ లేదు. దీనిపై అధికార సమాచారం లేదు. ఇది గ్రాండ్ i10 నియోస్ మాదిరిగానే 82bhp గరిష్ట శక్తితో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ కారు రూ. 8.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ యూనిట్ ఎఎంటీ (AMT)కి బదులుగా (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ మాన్యువల్‌తో వస్తుంది.

హ్యుందాయ్ ఆరాపై రూ. 53 వేలు డిస్కౌంట్ :
హ్యుందాయ్ భారత మార్కెట్లో హ్యుందాయ్ ఆరాను కాంపాక్ట్ సెడాన్ కారుగా అందిస్తోంది. ఈ ఫిబ్రవరిలో ఈ కారు కొనుగోలు చేస్తే.. గరిష్టంగా రూ. 53వేల వరకు ఆదా చేసుకోవచ్చునని సమాచారం.

హ్యుందాయ్ గ్రాండ్ నియోస్ i10పై రూ. 68వేలు డిస్కౌంట్ :
భారత మార్కెట్లోని హ్యుందాయ్ నుంచి అత్యంత చౌకైన కారుగా హ్యుందాయ్ గ్రాండ్ నియోస్ i10 హ్యాచ్‌బ్యాక్ విభాగంలో లాంచ్ అయింది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 82bhp పవర్, 113Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Read Also : Reliance Jio : జియోలో ఆ చౌకైన ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. మరో ప్లాన్ ధర తగ్గింది.. డేటా, వ్యాలిడిటీ ఎంత? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

ఈ మోడల్ కంపెనీ అమర్చిన CNG కిట్‌లో కూడా అందుబాటులో ఉంది. మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. అయితే, CNG ఉపయోగించి 68bhp, 95Nm మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ నెలలో ఈ కారు కొనడం ద్వారా వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. సమాచారం ప్రకారం.. కంపెనీ ఈ కారుపై గరిష్టంగా రూ.68 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఆఫర్ 2024 మోడళ్లపై మాత్రమే డిస్కౌంట్లు :
హ్యుందాయ్ ఈ ఆఫర్ 2024 సంవత్సరంలో తయారైన యూనిట్లపై మాత్రమే అందిస్తోంది. చాలా మంది డీలర్ల వద్ద కొన్ని యూనిట్లు మిగిలి ఉన్నాయి. ఆయా మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీరు వాహనం కొనాలనుకుంటే, డిస్కౌంట్ ఆఫర్ల గురించి సమాచారాన్ని పొందడానికి మీ నగరంలోని వివిధ హ్యుందాయ్ షోరూమ్‌లను సందర్శించవచ్చు.