Ola S1 X Plus Price Cut : ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 20వేల ధర తగ్గింపు.. డోంట్ మిస్!

Ola S1 X Plus Price Cut : ఓలా ఎలక్ట్రిక్ 'డిసెంబర్ టు రిమెంబర్' క్యాంపెయిన్‌లో భాగంగా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 20వేల ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Ola S1 X Plus Price Cut : ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 20వేల ధర తగ్గింపు.. డోంట్ మిస్!

Ola S1 X Plus electric scooter gets Rs 20K Price Cut

Ola S1 X Plus Price Cut : భారత మార్కెట్లో ఈవీ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. వినియోగదారులను ఆకట్టకునేందుకు ఈవీ కంపెనీలు కూడా సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ వెహికల్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కూడా తమ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.

ఓలా ఎలక్ట్రిక్‌ ‘డిసెంబర్‌ టు రిమెంబర్‌’ పేరుతో ఒక క్యాంపెయిన్‌ను ప్రకటించిన సందర్భంగా సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను భారీగా తగ్గించింది. అయితే, డిసెంబర్‌ 3 నుంచి ఈ క్యాంపెయిన్‌ ప్రారంభమైంది. ఓలా ఎస్‌1 ఎక్స్‌ ప్లస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై రూ. 20వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దాంతో ఓలా ఈవీ స్కూటర్ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్)కు సొంతం చేసుకోవచ్చు.

Read Also : WhatsApp View Once : వాట్సాప్ డెస్క్‌టాప్‌లో ‘వ్యూ వన్స్‘ ఫీచర్ మళ్లీ వస్తోంది.. ఫొటోలు, వీడియోలను స్టోర్ చేయడం కుదరదు!

‘డిసెంబర్ టు రిమెంబర్’ క్యాంపెయిన్‌‌తో డిస్కౌంట్ :
ఈవీ తయారీదారు ‘డిసెంబర్ టు రిమెంబర్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ డిస్కౌంట్ ప్రకటించింది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ. 5వేల వరకు తగ్గింపు, జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు, 6.99 శాతం తక్కువ వడ్డీ రేట్లు వంటి ఫైనాన్స్ ఆఫర్‌లతో కంపెనీ ఈవీ రేంజ్‌ని కూడా పొందవచ్చు.

బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ సింపుల్ ఎనర్జీతో తొలి ఉత్పత్తి సింపుల్ వన్‌లో సరసమైన వేరియంట్‌ను డిసెంబర్ 15న లాంచ్ చేయనున్నట్టు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ ధర తగ్గింపును ప్రకటించింది. పూర్తిగా పనితీరు, డిజైన్, స్పెషిఫికేషన్ల పరంగా స్టేబుల్ బ్యాటరీతో మాత్రమే వస్తుంది. ఈ మార్పులు ధర తగ్గింపులకు అనుగుణంగా ఉంటాయి.

Ola S1 X Plus electric scooter gets Rs 20K Price Cut

Ola S1 X Plus electric scooter 

గంటకు 90కి.మీ వేగంతో టాప్ స్పీడ్ :
ఓలా ఎస్1‌ఎక్స్ ప్లస్ 3కెడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఉపయోగిస్తుంది. తద్వారా 151 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. 6కెడబ్ల్యూ మోటార్‌ ఆధారితంగా పనిచేస్తుంది. 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. గంటకు 90కిలోమీటర్ల టాప్ స్పీడ్ అందుకుంటుంది. ఓలా ఇటీవల తన ఎస్1 పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.

ఇప్పుడు ఎస్1 ప్రో (2వ జనరేషన్) ధర రూ. 1.48 లక్షలు, ఎస్1 ఎయిర్ ధర రూ. 1.20 లక్షలు ఉంటుంది. అత్యంత సరసమైన మోడల్, ఎస్1ఎక్స్, ఎస్1 ఎక్స్ (3kWh), ఎస్1 ఎక్స్ (2kWh) బుకింగ్‌లతో మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రూ. 999 టోకెన్ మొత్తంతో ఓపెన్ అవుతుంది. ఈ రెండు ఓలా స్కూటర్ల ప్రారంభ ధరలు వరుసగా రూ. 99,999, రూ. 89,999 నుంచి అందుబాటులో ఉంటాయి.

Read Also : WhatsApp Username Feature : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై యూజర్‌నేమ్‌తో సెర్చ్ చేయొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?