Mutual Funds
Mutual Funds : మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఈక్విటీ, కమోడిటీ, డైవర్సిఫైడ్ ప్రాపర్టీలపై పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు అద్భుతమైన అవకాశం.
అందుకే, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి లంప్ సమ్ (Lump Sum), సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అద్భుతమైన మార్గాలుగా చెప్పొచ్చు.
దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా అధిక మొత్తంలో రాబడి పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా రిటైర్మెంట్ సమయంలో డబ్బుకు లోటు లేకుండా మిగతా జీవితం ఆనందంగా బతికేయొచ్చు.
ఒకవేళ, ఎవరైనా తమ కెరీర్ ప్రారంభంలోనే పెట్టుబడి పెడితే.. 50 ఏళ్ల వయస్సులోపు వారు కోట్ల రూపాయలను సంపాదించుకోవచ్చు. ఆపై రిటైర్మెంట్ ముందుగానే తీసుకుని ఆ డబ్బులతో జీవనం కొనసాగించవచ్చు.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఒకేసారి రూ. 8 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో రూ. 5కోట్ల విలువైన కార్పస్ ఎలా పొందవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్‌లో ఒకేసారి పెట్టుబడి :
ఈక్విటీ, హైబ్రిడ్, డెట్ మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. ఒక మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలికంగా భారీగా రాబడిని పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి అనేది ప్రత్యక్ష ఈక్విటీ ఎక్స్‌పోజర్‌తో పోలిస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది.
తద్వారా దీర్ఘకాలంలో స్థిరమైన రాబడిని పొందవచ్చు. అందుకే చాలా మంది SIPలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. అందులో చాలా మంది రిటైర్మెంట్ కోసం ఎక్కువగా SIPలో పెట్టుబడి పెడుతుంటారు.
25 ఏళ్ల వ్యక్తి దగ్గర రూ. 5 లక్షలు ఉంటే.. 55 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒక కార్పస్ కోసం ఒకేసారి పెట్టుబడి పెట్టాలని అనుకుంటే.. 12 శాతం వార్షిక రాబడితో ఏకమొత్త పెట్టుబడిపై ఎంత సంపాదిస్తారంటే.. 12 శాతం వార్షిక రాబడితో అంచనా రాబడి రూ. 1,44,79,961గా ఉంటుంది. అలాగే, కార్పస్ అంచనా రూ. 1,49,79,961గా ఉంటుంది. అంటే.. ఇక్కడ పెట్టుబడి 50 రెట్లు పెరిగిందని చెప్పొచ్చు.
రూ. 8 లక్షల పెట్టుబడితో రూ. 5 కోట్ల సంపాదన :
రిటైర్మెంట్ కోసం పెట్టుబడిని ఒకేసారి రూ. 8 లక్షలు పెడితే.. 12 శాతం, 13 శాతం, 14 శాతం వార్షిక రాబడితో పెట్టుబడులపై ఎన్ని ఏళ్లలో ఎంత సంపాదిస్తారంటే.. రూ. 8 లక్షల పెట్టుబడిపై 12శాతం రాబడితో రూ. 5 కోట్ల కార్పస్ వరకు పొందవచ్చు. 12 శాతం వార్షిక రాబడితో 37 ఏళ్లలో రూ. 5,21,85,474 కనీస రాబడి అంచనా అయితే, కార్పస్ రూ. 5,29,85,474 అవుతుంది.
ఒకేసారి రూ. 8 లక్షల పెట్టుబడిపై 13 శాతం రాబడితో రూ. 5 కోట్ల కార్పస్ వరకు పొందవచ్చు. 34 ఏళ్లలో మూలధన లాభం రూ. 5,02,21,951 అంచనా, కార్పస్ రూ. 5,10,21,951 అవుతుంది.
అదే 14శాతం రాబడితో రూ. 8 లక్షల పెట్టుబడి నుండి రూ. 5 కోట్ల కార్పస్ వరకు పొందవచ్చు. 32 ఏళ్లలో మూలధన లాభం రూ. 5,21,71,861 అంచనా అయితే, కార్పస్ రూ. 5,29,71,861 కోట్ల రాబడి పొందవచ్చు.