UAN Password : మీ UAN నెంబర్ మర్చిపోయారా? ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా తిరిగి పొందొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.. !
UAN Password : మీ UAN నెంబర్ గుర్తులేదా? పాస్ వర్డ్ ఎలా రీసెట్ చేయాలో తెలియదా? ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా రికవర్ చేసుకోవచ్చు.

UAN Password
UAN Password : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? అయితే, ఆన్‌లైన్‌లో (UAN Password) ఈజీగా UAN నెంబర్ తిరిగి పొందవచ్చు. అంతేకాదు.. PF బ్యాలెన్స్ కూడా చెక్ చేయొచ్చు.
మీ పీఎఫ్ అకౌంట్ ట్రాక్ చేయడంతో మరిన్ని వివరాలను పొందవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ నిర్వహణ కోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అత్యంత కీలకం. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా ఈ UAN నెంబర్ మాత్రం అలానే ఉంటుంది.
ఒకవేళ మీరు యూఏఎన్ నెంబర్ లింక్ చేయకపోతే.. మీ PF బ్యాలెన్స్‌ను యాక్సెస్ చేయలేరు. అందులో డబ్బులను విత్ డ్రా కూడా చేయలేరు. మీ వ్యక్తిగత KYC వివరాలను కూడా అప్‌డేట్ చేయలేరు. యూఏఎన్ అనేది 12-అంకెల ప్రత్యేక సంఖ్య.
ఈపీఎఫ్ అకౌంట్ కలిగిన ప్రతి ఉద్యోగికి కంపెనీ కేటాయించిన న్యూమరిక్ ఐడీనే UAN అంటారు. ఈ యూఏఎన్ నెంబర్ పీఎఫ్ అకౌంటుకు లింక్ అయి ఉంటుంది. మీ UAN అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోతే ఈ కింది విధంగా ఈజీగా రీసెట్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో PF బ్యాలెన్స్ చెక్ చేయండి. PF విత్‌డ్రా లేదా ట్రాన్స్‌ఫర్ KYC డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయండి. నెలవారీ కాంట్రిబ్యూషన్ SMS అలర్ట్స్ పొందండి.
UAN లేకుండా మీ EPF యాక్సెస్ చేయలేరని గమనించాలి. జాబ్స్ మారడం, రిటైర్మెంట్ సమయంలో UAN నెంబర్ సులభంగా పొందవచ్చు. ఆన్‌లైన్‌లో UAN ఎలా పొందాలంటే?
1. UAN హెల్ప్‌డెస్క్ విజిట్ చేయండి :
అధికారిక EPFO వెబ్‌సైట్‌కి వెళ్లండి (https://www.epfindia.gov.in) ఎంప్లాయిస్ కోసం ‘Services’ ట్యాబ్ కింద ‘Know your UAN’పై క్లిక్ చేయండి.
2. మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయండి :
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మీ పేరు, పుట్టిన తేదీ, CAPTCHA కోడ్‌ను ఎంటర్ చేయండి ‘Request OTP’పై క్లిక్ చేయండి.
3. OTP వెరిఫిషన్ :
మీ మొబైల్‌కు ఓటీపీ అందుకుంటారు. OTP ఎంటర్ చేసి Continue ఆప్షన్ ట్యాప్ చేయండి.
4. అదనపు డేటాను ఎంటర్ చేయండి :
ఐడెంటిటీ వెరిఫికేషన్ మెథడ్ ఎంచుకోండి. PAN, ఆధార్ లేదా సభ్యుల ఐడీ డాక్యుమెంట్ వివరాలను ఎంటర్ చేయండి.
5. UAN ఎలా పొందాలి :
మీ పూర్తి వ్యక్తిగత వివరాలు ఈపీఎఫ్ఓ రికార్డులతో సరిపోలితే SMS ద్వారా UAN నెంబర్ పొందవచ్చు.
మొబైల్ నంబర్, ఈపీఎఫ్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి. మీ డేటా సరిపోలకపోతే కంపెనీ లేదా ఈపీఎఫ్ఓ ఆఫీసును సంప్రదించండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం UAN నెంబర్ దగ్గర ఉంచుకోండి.