Top 5 Smartphones : కిర్రాక్ ఫోన్లు భయ్యా.. రూ. 18వేల లోపు ధరలో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీదే ఛాయిస్..!

Top 5 Smartphones : మీ బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కావాలా? రూ. 18వేల లోపు ధరలో టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.. ఇప్పుడే కొనేసుకోండి..

Top 5 Smartphones : కిర్రాక్ ఫోన్లు భయ్యా.. రూ. 18వేల లోపు ధరలో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీదే ఛాయిస్..!

Top 5 Smartphones

Updated On : May 29, 2025 / 4:23 PM IST

Top 5 Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మీ బడ్జెట్‌లో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. ధర తక్కువ మాత్రమే కాదు.. ఫీచర్లు పరంగా కూడా బాగుండాలి. కొద్దిగా ధర ఎక్కువ అయినా ఫీచర్ల విషయంలో మాత్రం అసలు కంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు.

Read Also : PM Kisan Instalment : బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడాలంటే ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!

మీరు కూడా గేమింగ్, హై క్వాలిటీ కెమెరా ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలంటే మీకోసం ప్రస్తుతం రూ. 18వేల లోపు ధరలో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు ఏ ఫోన్ కావాలో ఎంచుకుని కొనేసుకోండి.

వివో T4X :
వివో T4X ఫోన్‌లో మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్ ఉంది. 6.72-అంగుళాల LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో రిచ్‌గా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ 6500mAh బ్యాటరీ కలిగి ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. 50+2MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. గేమింగ్ లేదా సోషల్ మీడియా వినియోగానికి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.

ఐక్యూ జెడ్ 10X :
ఐక్యూ Z10x ఫోన్ దాదాపు వివో T4X మాదిరిగానే ఉంటుంది. అదే డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే, కెమెరా సింగిల్ స్పెసిఫికేషన్‌లతో వస్తాయి.

కానీ, ఐక్యూ యూఐ క్లీన్, రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ ఐక్యూ జెడ్ 10x ఫోన్‌ మరింత ఆకర్షణీయంగా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఫీచర్ల కోసమైన ఈ ఐక్యూ ఫోన్ కొనేసుకోవచ్చు.

రియల్‌మి P3 :
రియల్‌మి P3 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ మిడ్-రేంజ్‌లో కూడా అద్భుతంగా ఉంటుంది. 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, కలర్ ఆప్షన్లలో వస్తుంది.

బ్యాక్ సైడ్ 50+2MP కెమెరా, ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా ఉన్నాయి. ఈ రేంజ్‌లో వీడియో కాలింగ్, సెల్ఫీలకు బెటర్ ఆప్షన్. బ్యాటరీ 6000mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రోజంతా వస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 50S 5G ప్లస్ :
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G ప్లస్ ఫోన్ 6.78 అంగుళాల 144Hz అమోల్డ్ డిస్‌ప్లే, గేమింగ్, వీడియోలకు బెస్ట్ అని చెప్పొచ్చు. డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్‌సెట్, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ ఫోన్ 64MP ప్రైమరీ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా ఫోటోగ్రఫీ ప్రియులకు అద్భుతమైన ఆప్షన్. బ్యాటరీ 5500mAh కొంచెం చిన్నదైనా కానీ 45W ఛార్జింగ్‌తో వేగంగా ఛార్జ్ అవుతుంది.

Read Also : Post Office Scheme : పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 100 ఇలా సేవ్ చేస్తే.. రూ. 2 లక్షలకు సంపాదించుకోవచ్చు!

ఒప్పో K13 :
ఒప్పో K13 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో 8GB ర్యామ్ కలిగి ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా 6.67 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తోంది. ఈ ఫోన్ కెమెరాలో కూడా ముందుంది. 50+2MP బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.