Post Office Scheme : పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 100 ఇలా సేవ్ చేస్తే.. రూ. 2 లక్షలకు పైగా సంపాదించుకోవచ్చు!
Post Office Scheme : పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ ద్వారా కేవలం రూ. 100 పెట్టుబడితో ఐదేళ్లలో రూ. 2లక్షలకు పైగా రాబడి పొందవచ్చు..

Post Office Scheme
Post Office Scheme : పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? పోస్టాఫీసులో అద్భుతమైన పథకం (Post Office Scheme) ద్వారా లక్షల్లో సంపాదించుకోవచ్చు.
పోస్టాఫీసు అందించే రికరింగ్ డిపాజిట్ (Recurring Deposit) పథకంలో రోజుకు రూ.100 డిపాజిట్ చేస్తే పోవాలి అంతే.. ఇలా పెట్టుబడి పెట్టడం ద్వారా కేవలం 5 ఏళ్లలో దాదాపు రూ.2.14 లక్షలు రాబడి పొందవచ్చు.
పైగా ఈ RD స్కీమ్ చాలా సురక్షితమైన కూడా. గ్యారెంటీ రాబడిని ఇచ్చే పథకం. ఇందులో రుణం తీసుకోవచ్చు. అవసరమైతే పథకం కాల పరిమితిని కూడా పొడిగించుకునే అవకాశం ఉంటుంది. మీరు ప్రతి నెలా కొద్ది మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా స్థిర వడ్డీని పొందవచ్చు.
పోస్టాఫీస్ RD స్కీమ్ ఏంటి? :
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్(Post Office Scheme) స్కీమ్ అనేది 5 ఏళ్ల ప్లాన్. ప్రతి నెలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీకు 6.7శాతం వార్షిక వడ్డీ కూడా లభిస్తుంది. రోజుకు రూ. 100 సేవ్ చేయడంలో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రతిరోజూ రూ. 100 డిపాజిట్ చేస్తే పోతే నెలలో రూ. 3వేలు జమ అవుతుంది. అదే 5 ఏళ్లలో మొత్తం డిపాజిట్ రూ. 1,80,000 అవుతుంది. దానిపై వడ్డీ సుమారు రూ. 34,097 ఉంటుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 2,14,097 లక్షలు రాబడిగా పొందవచ్చు.
రుణ సౌకర్యం కూడా :
మీకు మధ్యలో డబ్బు (Post Office Scheme) అవసరమైతే.. 12 నెలలు చెల్లించిన తర్వాత డిపాజిట్ మొత్తంలో 50శాతం వరకు రుణం తీసుకోవచ్చు. వడ్డీ ఆర్‌డీ వడ్డీ కన్నా 2శాతం ఎక్కువ ఉంటుంది.
అకౌంట్ పొడిగింపు :
5 ఏళ్ల తర్వాత కూడా RD పథకాన్ని మరో 5 ఏళ్లకు పొడిగించవచ్చు. అకౌంట్ ఓపెన్ చేశాక వర్తించే అదే వడ్డీ పొడిగించిన అకౌంట్‌లో పొందవచ్చు. ఇలా పొడిగించిన అకౌంట్ ఎప్పుడైనా క్లోజ్ చేయొచ్చు. ఆర్‌డీ అకౌంట్ వడ్డీ రేటు పూర్తి సంవత్సరాలకు వర్తిస్తుంది.
ఒక ఏడాది కన్నా తక్కువ ఏడాదికి సేవింగ్ అకౌంట్ ప్రకారం.. వడ్డీ పొందవచ్చు. ఉదాహరణకు.. పొడిగించిన అకౌంట్ 2 ఏళ్ల 6 నెలల తర్వాత క్లోజ్ చేస్తే.. 2 ఏళ్ల పాటు 6.7 శాతం వడ్డీ వస్తుంది. 6 నెలల మొత్తానికి 4శాతం రేటుతో వడ్డీని పొందవచ్చు.