OnePlus 13R Price : ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ డిస్కౌంట్.. వన్‌ప్లస్ 13Rపై భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరలో మళ్లీ దొరకదు!

OnePlus 13R Price : ఫ్లిప్‌కార్ట్‌‌లో వన్‌ప్లస్ 13పై భారీ తగ్గింపు అందిస్తోంది. రూ. 38వేల లోపు ధరలో వన్‌ప్లస్ ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

OnePlus 13R Price

OnePlus 13R Price Drop : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. పాపులర్ మిడ్ రేంజ్ ఫోన్‌లలో ఒకటైన వన్‌ప్లస్ 13R ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. మీరు ఈ వన్‌ప్లస్ ఫోన్‌ను రూ.38వేల లోపు ధరకు పొందవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవని గమనించాలి. భారత మార్కెట్లో ఈ డీల్ తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Read Also : iPhone 18 Price : ఆపిల్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. రాబోయే ఐఫోన్ 18 ధర భారీగా పెరగొచ్చు.. మీరు ఊహించలేరంతే..!

వన్‌ప్లస్ 13R ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13R ప్రారంభ ధర రూ.42,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ప్రస్తుతం రూ.39,474కి లిస్టు అయింది. ఫ్లిప్‌కార్ట్ వన్‌ప్లస్ 13Rపై రూ.3,525 ధర తగ్గింపును అందిస్తోంది. HDFC క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.2వేలు తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ ఆదా చేయాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు.

వన్‌ప్లస్ 13R స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13R 5G ఫోన్ 6.78-అంగుళాల 1.5K LTPO 4.1 అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. వన్‌ప్లస్ 13R స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 16GB వరకు (LPDDR5x) ర్యామ్, 512GB UFS 4.0తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6,000mAh బ్యాటరీతో వస్తుంది.

Read Also : Samsung Galaxy M56 5G : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త శాంసంగ్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ఇలా చేస్తే తక్కువ ధరకే కొనేసుకోవచ్చు..!

అలాగే, ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు IP65 సర్టిఫికేషన్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13R 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఆక్వా టచ్ 2.0 ఫీచర్ కలిగి ఉంది. స్క్రీన్ తడిగా ఉన్నప్పుడు కూడా రెస్పాండ్ అవుతుంది. గ్లోవ్ మోడ్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది.