OnePlus 13s Sale
OnePlus 13s Sale : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ 13s ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ లేటెస్ట్ కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ మధ్యాహ్నం నుంచి అన్ని ఆన్‌లైన్, (OnePlus 13s Sale) ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉన్నాయి. గత వారమే లాంచ్ అయిన వన్‌ప్లస్ 13s ఫోన్ 12GB ర్యామ్ సహా ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. కంపెనీ కస్టమర్ల కోసం మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.
వన్‌ప్లస్ 13s భారత్ ధర, ఆఫర్లు :
వన్‌ప్లస్ 13s ఫోన్ (OnePlus 13s Sale) 12GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 512GB రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. ఈ ఫోన్ బేస్ మోడల్ ధర రూ. 54,999 ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ. 59,999 గా ఉంది. ఈ సేల్ సమయంలో ఫోన్ కొనుగోలుపై రూ. 5వేలు బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దాంతో వరుసగా ఈ రెండు వేరియంట్లు ధర రూ.49,999, రూ. 54,999కు లభిస్తున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ పింక్ శాటిన్, బ్లాక్ వెల్వెట్, గ్రీన్ సిల్క్ 3 అద్భుతమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అదనంగా, పాత ఫోన్లలో ట్రేడ్ చేసే కస్టమర్లకు రూ. 5వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. ఈ ఫోన్‌కు 180 రోజుల ఫ్రీ రీప్లేస్‌మెంట్ ప్లాన్‌ను అందిస్తోంది. జూలై 1, 2025 కన్నా ముందు కొనుగోలుచేసే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. లైఫ్ టైమ్ ఫ్రీ డిస్‌ప్లే వారంటీతో వస్తుంది.
వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13s లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ (OnePlus 13s Sale) క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB ర్యామ్ (24GB వరకు) లేదా గరిష్టంగా 512GB స్టోరేజీతో వస్తుంది. గేమింగ్ సమయంలో ఫోన్ కూలింగ్ కోసం భారీ 4400mm² గ్లేసియర్ వేపర్ చాంబర్ (VC) కూలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్ OS 15పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ AI ఫీచర్లతో వస్తుంది. ప్రత్యేకమైన W1 Wi-Fi చిప్‌ను కలిగి ఉంటుంది.
ఆసక్తిగల యూజర్లు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్, డస్ట్ నిరోధకతకు IP65 రేటింగ్, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, NFC సపోర్టు కలిగి ఉంది. ఈ ఫోన్ 5,850mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వన్‌ప్లస్ 13s కూడా ఐఫోన్ 16 మాదిరిగానే మల్టీ-ఫంక్షన్ బటన్‌ను కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 13 మాదిరిగా 5.5G నెట్‌వర్క్‌కు సపోర్టు ఇస్తుంది.
ఈ కాంపాక్ట్ ఫోన్ 6.32-అంగుళాల FHD+ అమోల్డ్ ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంది. 1600 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశం, మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డాల్బీ విజన్, HDR10 ప్లస్‌కు సపోర్టు ఇస్తుంది. డిస్‌ప్లే క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
అదనపు సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. బ్యాక్ సైడ్ వన్‌ప్లస్ 13s డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ OIS కెమెరాతో పాటు 50MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. 2x ఆప్టికల్ జూమ్, 20x డిజిటల్ జూమ్‌కు సపోర్టు ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.