OnePlus Diwali Festive Sale 2025 : వారెవ్వా.. పండగ సేల్ ఆఫర్లు.. ఈ వన్‌ప్లస్ ఫోన్లు, టాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు.. ఎప్పటినుంచంటే?

OnePlus Diwali Festive Sale 2025 : వన్‌ప్లస్ దీపావళి పండగ సేల్ రాబోతుంది. వన్‌ప్లస్ 13 ఫోన్లు, టాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.

OnePlus Diwali Festive Sale 2025

OnePlus Diwali Festive Sale 2025 : పండుగ సీజన్ వచ్చేస్తోంది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అందులోనూ వన్‌‌ప్లస్ అభిమానులకు అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ దీపావళి సేల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ సమయంలో వినియోగదారులు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు, నార్డ్ సిరీస్, టాబ్లెట్‌లు, ఆడియో ప్రొడక్టులతో సహా అన్ని కేటగిరీలపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.

వన్‌ప్లస్ దీపావళి సేల్ సెప్టెంబర్ 22 అర్ధరాత్రి నుంచి (OnePlus Diwali Festive Sale 2025) ప్రారంభమవుతుంది. OnePlus.in, Amazon, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, ఇతర రిటైల్ భాగస్వాములతో సహా మల్టీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ సమయంలో OnePlus 13, OnePlus 13R, OnePlus 13s, OnePlus Nord 5, Nord CE 5 ఫోన్లు భారీ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

దీపావళి సేల్‌లో వన్‌ప్లస్ 13, 13R, 13s ధరలు తగ్గింపు :
ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 సిరీస్ అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉండనుంది. అన్ని బ్యాంక్ ఆఫర్‌లతో వన్‌ప్లస్ 13 ధర రూ.57,749కు సొంతం చేసుకోవచ్చు. ఈ వన్‌ప్లస్ ఫోన్ గత ఏడాదిలో రూ.69,999కి లాంచ్ అయింది.

Read Also : Apple iPhone 18 Pro Max : కొత్త ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ధర, డిజైన్, కెమెరా ఫీచర్లు లీక్.. ఇంకా ఏం ఉండొచ్చంటే?

వన్‌ప్లస్13R ధర కూడా భారీగా తగ్గనుంది. బ్యాంక్ డిస్కౌంట్లతో రూ. 35,749కు లభిస్తుంది. రూ. 7వేలు తగ్గింపు లభిస్తుంది. కొత్తగా వన్‌ప్లస్ 13s కూడా డిస్కౌంట్ ధరలకు లభిస్తాయి. అన్ని బ్యాంక్ ఆఫర్లతో వన్‌ప్లస్ 13s ధర రూ. 47,750 కన్నా తగ్గుతుంది.

దీపావళి సేల్ నార్డ్ 5, నార్డ్ CE5 ధరలు తగ్గింపు :
వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 కూడా తగ్గింపు ధరలతో లభిస్తాయి. వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ CE5 కూడా డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో రూ.28,499, రూ.21,499 ధరలకు లభిస్తాయి.

వన్‌ప్లస్ బడ్స్ 4, ప్రో 3 ధర తగ్గింపు :
వన్‌ప్లస్ బడ్స్ 4 రూ.4,799కి అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 రూ.7,999కి లభ్యమవుతున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 సిరీస్, బుల్లెట్స్ వైర్‌లెస్ Z2 ANC, ఇతర ఆడియో ప్రొడక్టులు భారీ డిస్కౌంట్లతో లభిస్తాయి.

టాబ్లెట్లు ధర తగ్గింపు :
టాబ్లెట్ల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ రూ.11,749కు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ ప్యాడ్ గో, వన్‌ప్లస్ ప్యాడ్ 2, వన్‌ప్లస్ ప్యాడ్ 3 వంటి ఇతర ప్రొడక్టుల ధరలు కూడా తగ్గుతాయి ఈ సేల్ మొదటి మూడు రోజులలో వన్‌ప్లస్ ప్యాడ్ 3తో ఫ్రీగా స్టైలస్ వంటి బండిల్ డీల్స్ కూడా పొందవచ్చు.