OnePlus Nord CE4 Lite 5G : వన్‌ప్లస్ కొత్త 5జీ ఫోన్ చూశారా? కొంటే ఇలాంటి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలి.. లాంచ్ ఆఫర్లు కూడా!

OnePlus Nord CE4 Lite 5G : ఈ వన్‌ప్లస్ నార్డ్ సీఈ లైట్ ఫోన్ మెరుగైన ఫొటోలకు బ్యాక్ ప్యానెల్‌లో సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌తో 50ఎంపీ ప్రధాన కెమెరాతో వస్తుంది. ముందున్న నార్డ్ సీఈ 3 లైట్ కన్నా భారీ అప్‌గ్రేడ్ అందిస్తుంది.

OnePlus Nord CE4 Lite 5G : వన్‌ప్లస్ కొత్త 5జీ ఫోన్ చూశారా? కొంటే ఇలాంటి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలి.. లాంచ్ ఆఫర్లు కూడా!

OnePlus Nord CE4 Lite 5G launched ( Image Source : Google )

OnePlus Nord CE4 Lite 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ ఎట్టకేలకు లాంచ్ అయింది. గత ఏడాదిలో నార్డ్ సీఈ3 లైట్ కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది. ఈసారి, 5జీ ఫోన్ అమోల్డ్ డిస్‌ప్లే, భారీ 5500mAh బ్యాటరీ, 50ఎంపీ ప్రైమరీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది.

వినియోగదారులకు బడ్జెట్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 80డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జర్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. కొత్తగా లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ముఖ్య ఫీచర్లు ఇలా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ టాప్ స్పెసిఫికేషన్లు :
డిస్‌ప్లే : వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ భారీ 6.6-అంగుళాల 120Hz అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో ఆక్వా టచ్‌తో ప్రొటెక్ట్ చేస్తుంది. వేళ్లు తడిగా ఉన్నా లేదా స్క్రీన్‌పై నీటి బిందువులు ఉన్నప్పటికీ స్మూత్ స్క్రీన్ నావిగేషన్‌ను అందిస్తుంది.

ప్రాసెసర్ : వన్‌ప్లస్ నార్డ్ సీఈ లైట్ సిరీస్ ప్రాసెసర్‌ను అప్‌గ్రేడ్ చేయలేదు. నార్డ్ సీఈ2, సీఈ 3 మాదిరిగానే నార్డ్ సీఈ4 లైట్ స్మార్ట్‌ఫోన్ కూడా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది.

Read Also : OnePlus Nord 3 Sale : అమెజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్.. రూ. 20వేల లోపు ధరకే వన్‌ప్లస్ నార్డ్ 3 సొంతం చేసుకోండి!

సాఫ్ట్‌వేర్ : వన్‌ప్లస్ నార్డ్ సీఈ లైట్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ఓఎస్ 14.0పై రన్ అవుతుంది. ఈ ఫోన్ కొన్ని బ్లోట్‌వేర్‌తో కూడా వస్తుంది.

కెమెరా : ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. సోనీ LYT-600 సెన్సార్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్-అసిస్ట్ కెమెరాతో సహా ఫ్రంట్ సైడ్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ ఫోన్ 16ఎంపీ కెమెరాను కలిగి ఉంది.

బ్యాటరీ : నార్డ్ సీఈ లైట్ 5500mAh బ్యాటరీతో 80W సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఈ ఫోన్ 5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. బాక్స్‌లో 80W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ లైట్ కీలక ఫీచర్లు :
ఈ వన్‌ప్లస్ నార్డ్ సీఈ లైట్ ఫోన్ మెరుగైన ఫొటోలకు బ్యాక్ ప్యానెల్‌లో సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌తో 50ఎంపీ ప్రధాన కెమెరాతో వస్తుంది. ముందున్న నార్డ్ సీఈ 3 లైట్ కన్నా భారీ అప్‌గ్రేడ్ అందిస్తుంది. వన్‌ప్లస్ మళ్లీ కొత్త వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్‌తో బాక్సీ డిజైన్, ఇతర కలర్ ఆప్షన్లతో నార్డ్ సీఈ సిరీస్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన లైమ్ కలర్‌లో కూడా అందుబాటులో ఉంది. యువ కస్టమర్ల దృష్టిని ఆకర్షించనుంది.

సూపర్ సిల్వర్, మెగా బ్లూ, అల్ట్రా ఆరెంజ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ సరసమైన వన్‌ప్లస్ ఫోన్ భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5500mAh బ్యాటరీతో పాటు 80డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బాక్సులో ఛార్జర్ కూడా వస్తుంది. నార్డ్ సీఈ4 లైట్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ సీఈ3 లైట్ ఎల్ఈడీ డిస్‌ప్లేతో పోలిస్తే.. భారీ అప్‌గ్రేడ్ అందిస్తుంది. డిస్‌ప్లే వన్‌ప్లస్ కొత్త ఆక్వా టచ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. మీ చేతులు తడిగా ఉన్నప్పటికీ లేదా స్క్రీన్‌పై నీటి బిందువులు ఉన్నప్పటికీ సులభంగా ఆపరేట్ చేయొచ్చు.

భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ ధర ఎంతంటే? :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 భారత్‌లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. రూ. 19,999 ధర కలిగిన బేస్ మోడల్‌లో 128జీబీ స్టోరేజ్ ఉంది. అయితే, రూ. 22,999 ధర కలిగిన హై-ఎండ్ మోడల్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఈ రెండు వేరియంట్లు 8జీబీ ర్యామ్ అందిస్తాయి.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ భారత్‌లో గురువారం, జూన్ 27, 2024 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సూపర్ సిల్వర్, మెగా బ్లూ వేరియంట్‌లకు అందుబాటులో ఉంటుంది. అల్ట్రా ఆరెంజ్ కలర్ వేరియంట్ తరువాత తేదీలో అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, అమెజాన్ వెబ్‌సైట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా ఇతర ఆఫ్‌లైన్ పార్టనర్ స్టోర్‌ల నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

లాంచ్ ఆఫర్‌లో భాగంగా వన్‌ప్లస్ ధరపై తగ్గింపును అందిస్తోంది. కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐతో రూ. వెయ్యి తగ్గింపు, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై 3 నెలల నో కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే విద్యార్థులు రూ. 250 అదనపు తగ్గింపును పొందవచ్చు.

కొత్త జియో పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5జీ కొనుగోలుపై రూ. 2250 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ కన్స్యూమర్ ఫైనాన్స్, హెచ్‌డీబీఎఫ్ఎస్ కన్స్యూమర్ లోన్‌లతో 6 నెలల నో-కాస్ట్ ఈఎంఐని కూడా కస్టమర్‌లు పొందవచ్చు.

Read Also : Gmail Gemini AI : ఇకపై జీమెయిల్‌లోనూ జెమిని ఏఐ టూల్.. ఈ కొత్త ఫీచర్ ఎలా వాడాలో తెలుసా?