Onion Price : తగ్గిన ఉల్లి ధరలు…మహారాష్ట్ర ఉల్లి కిలో ధర రూ.10

హైదరాబాద్ నగరంలో ఉల్లి ధర గణనీయంగా తగ్గింది. నగర పరిధిలోని మలక్ పేట మార్కెటుకు ఉల్లి లోడ్ల లారీలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మార్కెట్ లో ఉల్లి దరలు అమాంతం పడిపోయాయి.....

Onion Price : హైదరాబాద్ నగరంలో ఉల్లి ధర గణనీయంగా తగ్గింది. నగర పరిధిలోని మలక్ పేట మార్కెటుకు ఉల్లి లోడ్ల లారీలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మార్కెట్ లో ఉల్లి దరలు అమాంతం పడిపోయాయి. కార్తీకమాసం పూర్తికానుండటంతోపాటు ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత సోమవారం 212 ఉల్లి లారీలు మార్కెట్ కు వచ్చాయి. మలక్ పేట మార్కెటులో 18,495 క్వింటాళ్ల ఉల్లికి వేలం నిర్వహించగా కిలో కనిష్ఠ ధర పది రూపాయలు పలికింది. ఉల్లి మొదటి రకం 40 రూపాయల ధర పలికింది.

ALSO READ : CM Jagan : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు

రెండో రకం ఉల్లి ధర రూ.35గా ఉంది. కర్నూలు జిల్లా నుంచి 14 లారీల్లో 1890 క్వింటాళ్ల ఉల్లిని వేలం వేయగా కిలో కనిష్ఠ ధర 8 రూపాయలు పలికింది. గత 20 రోజుల్లో ఉల్లి ధర ఒక్క సారిగా తగ్గిపోయిందని మార్కెట్ అధికారులు చెప్పారు. హోల్ సేల్ మార్కెట్ లో ఉల్లి ధరలు తగ్గినా రిటైల్ మార్కెట్ లో మాత్రం అధిక ధరలకే ఉల్లిని విక్రయిస్తున్నారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించింది. దీంతో మహారాష్ట్ర రైతులు ఉల్లిని హైదరాబాద్ మార్కెట్ కు తరలించారు.

ALSO READ : Mohammed Shami : ష‌మీ ఫామ్‌హౌస్ వ‌ద్ద భారీ సంఖ్య‌లో అభిమానులు.. ఎందుకంటే..?

మంగళవారం అమావాస్య సందర్భంగా ఉల్లి మార్కెట్ బంద్ చేస్తామని, దీంతో రైతులు పెద్ద ఎత్తున ఉల్లిని తీసుకువచ్చారని మార్కెట్ అధికారులు చెప్పారు. ఉల్లి ఎగుమతులపై నిషేధంతో రిటైల్, హోల్‌సేల్ మార్కెట్‌లలో వీటి ధరలు తగ్గుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో రైతులు, వ్యాపారుల నిరసనలు కొనసాగిస్తున్నారు. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని మహారాష్ట్ర కు చెందిన ఎంపీలు కేంద్రాన్ని కోరారు.

ALSO READ : CM Revanth Reddy : TSPSC పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..

మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లోని వివిధ మార్కెట్లలో ఉల్లి సేకరణను కేంద్రం వేగవంతం చేసినందున ఉల్లి రైతులకు ఎటువంటి నష్టం జరగదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అన్నారు. వినియోగదారులకు సరసమైన ధరలకు ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు డిసెంబర్ 8వతేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం విధించినట్లు సింగ్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు