3-day Week : ఇకపై వారానికి 3 రోజులే పని..!

కరోనా మహమ్మారి సమయంలో ఐటీ ఉద్యోగులంతా ఇంట్లో నుంచే పనిచేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Only three days a week : కరోనా మహమ్మారి సమయంలో ఐటీ ఉద్యోగులంతా ఇంట్లో నుంచే పనిచేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇండీడ్‌తో కలిసి ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ (NASCAM) ‘నాస్కామ్‌ రిటర్న్‌ టు వర్క్‌ప్లేస్‌ సర్వే’ను నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం.. ఉద్యోగులు, యాజమాన్యాలు ఆఫీస్‌ నుంచి పనిచేసేందుకు సమాన స్థాయిలో ఆసక్తి కనబరుస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి 50 శాతం సిబ్బందితో ఆఫీసులను తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ ఉద్యోగులంతా వారానికి మూడు రోజులు గ్రూప్‌లవారీగా ఆఫీసులకు వచ్చే వీలుందని నాస్కామ్‌ పేర్కొంది.
Read Also : Puneeth-Pranitha: ప్రణీత ఉదారత.. పునీత్ నివాళిగా మెడికల్ క్యాంప్! 

మధ్య వయస్సు వారితో పోల్చితే 25ఏళ్ల లోపున్న ఉద్యోగులు, 40ఏళ్ల పైబడిన ఉద్యోగులు.. ఆఫీస్‌కు తిరిగి రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు సర్వేలో తేలింది. మహిళా ఉద్యోగులు కూడా ఆఫీస్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు నాస్కామ్‌ తెలిపింది. తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నాల్లో మునిగిన 81శాతానికి పైగా కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయి.

72 శాతం కంపెనీలు సగం సిబ్బందితోనే వచ్చే ఏడాది నుంచి ఆఫీసులను తెరవాలని భావిస్తున్నాయి. కొవిడ్‌-19 దృష్ట్యా పనిలో కొత్త విధానాలను తీసుకురావాలని భావిస్తున్నాయి. వారానికి మూడు రోజులు ఇంటి నుంచి, మూడు రోజులు ఆఫీస్‌ నుంచి ఉద్యోగులతో వర్క్ చేయించుకోవాలని 70 శాతానికిపైగా సంస్థలు భావిస్తున్నాయి.
Read Also : Scotland : వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఎజెండా

ట్రెండింగ్ వార్తలు