Scotland : వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఎజెండా

స్కాట్లాండ్‌లో గ్లోబల్‌ క్లయిమేట్‌ 26వ శిఖర సమ్మేళనంలో.. వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఎజెండాను ప్రకటించారు ప్రధాని మోదీ.

Scotland : వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఎజెండా

Modi

Scotland Present PM Modi : స్కాట్లాండ్‌లో గ్లోబల్‌ క్లయిమేట్‌ 26వ శిఖర సమ్మేళనంలో.. వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఎజెండాను ప్రకటించారు ప్రధాని మోదీ. అలాగే ఈ సెక్టార్‌లోసాధించిన విజయాలను వివరించారు. సదస్సును ప్రారంభించిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. జల వాయువులో వస్తున్న మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయని… ప్రస్తుతం భూమి విధ్వంసానికి ఉపకరణంగా మారిందన్నారు. ప్రస్తుతం భూమి పరిస్థితి జేమ్స్‌బాండ్‌ సినిమాలా కాల్పనికంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ప్రకృతికి విరుద్ధంగా మనం చేస్తున్న పనులను ఇక్కడితో నిలిపివేయాలన్నారు.

Read More : WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఏంటోనియో గుటేరస్. ప్రకృతికి హాని కలిగించడం ద్వారా మన గోతులను మనమే తవ్వుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా మేల్కొని సరైన మార్గంలో వెళ్లాలని సూచించారు. రాబోయే తరానికి సమస్యలపై అవగాహన కల్పించేందుకు పాఠ్యాంశాల్లో వాతావరణ మార్పుల అనుకూల విధానాలను చేర్చాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. భారత దేశంలో తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల వల్ల.. పౌరులకు ప్రయోజనాలు కల్పిస్తూనే.. ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచామని చెప్పారాయన.

Read More : WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

అంతకు ముందు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మోదీ భేటి అయ్యారు. ఈ సమావేశంలో వాతావరణ మార్పులు, ద్వైపాక్షిక సంభంధాలపై చర్చించారు. వాతావరణ మార్పులపై చర్చించడానికి ఏర్పాటు చేసిన కాప్‌-26వ సమ్మిట్‌లో ప్రధాని మోదీతో పాటు 120 దేశాల ప్రభుత్వ అధినేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటేరస్‌, తదితర దేశాల నేతలను ఆత్మీయంగా పలకరించారు మోదీ.

Read More : AHA 2.0: దీపావ‌ళి వెలుగుల‌ను మ‌రింత పెంచ‌నున్న ‘ఐకాన్ స్టార్ ప్రెజెంట్స్ ఆహా 2.0’

ఇక స్కాట్లాండ్‌లోని ప్రవాస భారతీయులను మోదీ కలుసుకున్నారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని మోదీ అభినందించారు. వాతావారణ మార్పుల మీద గ్లాస్గోలో జరిగే సదస్సుపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కరువు, అకాల వర్షాలు, వరదలు, తుపానుల లాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారీ నష్టం సంభవిస్తోంది. గతేడాది కాలంలో భారత్‌ సుమారు 6 వేల 500 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. 17 వేల 827 కోట్లతో ఈ విషయంలో చైనా భారత్‌కన్నా ముందుంది. ఈ డేటాను ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసింది. ఈ నష్టాలకు కారణం వాతావరణ మార్పులేనని నిపుణుల అభిప్రాయం.