Oppo Find X8 Series : హాసెల్‌బ్లాడ్ మాస్టర్ కెమెరాతో ఒప్పో ఫైండ్ X8 సిరీస్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Oppo Find X8 Series Launch : ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫోన్ల గ్లోబల్ లాంచ్ తేదీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ రెండు ఫోన్‌లు నవంబర్ మధ్యలో అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉందని పుకార్లు సూచిస్తున్నాయి.

Oppo Find X8 Series : హాసెల్‌బ్లాడ్ మాస్టర్ కెమెరాతో ఒప్పో ఫైండ్ X8 సిరీస్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Oppo Find X8 Pro and Find X8 launching in India

Updated On : October 24, 2024 / 8:47 PM IST

Oppo Find X8 Series Launch : ఒప్పో నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ రాబోతుంది. కంపెనీ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫైండ్ ఎక్స్ 8, ఫైండ్ ఎక్స్ 8 ప్రోలను చైనాలో ఇటీవలే లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్‌లు త్వరలో భారత్ సహా గ్లోబల్ మార్కెట్‌లలోకి రానున్నాయని కంపెనీ ధృవీకరించింది. ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్ ఫోన్ల గ్లోబల్ లాంచ్ తేదీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ రెండు ఫోన్‌లు నవంబర్ మధ్యలో అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉందని పుకార్లు సూచిస్తున్నాయి.

మీడియాటెక్ డైమన్సిటీ 9400 చిప్‌సెట్‌తో సహా టాప్ హార్డ్‌వేర్‌ను అందించనుంది. కొత్త ఫైండ్ ఎక్స్8 సిరీస్ హాసెల్‌బ్లాడ్ మాస్టర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. కొత్త ఫోన్ కలర్ఓఎస్ 15లో రన్ అవుతాయి. 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు బ్యాటరీని కలిగి ఉంటుంది. కలర్ఓఎస్15లో భాగంగా ఒప్పో ఏఐ ఫార్వార్డ్ ఫైండ్ ఎక్స్8 సన్నగా తేలికగా ఉంటుంది. ఫైండ్ ఎక్స్8 ప్రో అనేది కెమెరా ఫ్లాగ్‌షిప్ జూమ్‌తో వస్తుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్‌లో ఏఐ సపోర్టు ఉన్న డ్యూయల్-పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కెమెరా సిస్టమ్, 50ఎంపీ సోనీ ఎల్‌వై-800 ప్రైమరీ సెన్సార్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, టెలిఫోటో సామర్థ్యాలతో పాటు కొత్త ఒప్పో ఫ్లాగ్‌షిప్‌ను ఫొటోగ్రఫీ-ఫోకస్డ్ ఫ్లాగ్‌షిప్‌గా అందిస్తుంది. ఒప్పో ప్రో మోడల్ 6.8-అంగుళాల 2కె 120Hz మైక్రో-కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉన్నట్లు సూచిస్తున్నాయి. అదనంగా, 100డబ్ల్యూ వైర్డు, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. వినియోగదారులకు లాంగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌ని అందిస్తుంది.

ఒప్పో బేసిక్ ఫైండ్ ఎక్స్8 విషయానికి వస్తే.. 6.5-అంగుళాల 1.5కె 120Hz ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే, 50ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 3ఎక్స్ టెలిఫోటో లెన్స్‌ను అందిస్తోంది. బ్యాటరీ కూడా 100డబ్ల్యూ వైర్డు, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో ప్రో మాదిరిగా ఉంటుంది. దీనికి 5600mAh బ్యాటరీ సపోర్టు అందిస్తుంది. ఒప్పో టీజర్లను పరిశీలిస్తే.. ఫొటోగ్రఫీ, డిస్‌ప్లే క్వాలిటీ, ఛార్జింగ్ సామర్థ్యంలో పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లకు కొత్త ఫైండ్ ఎక్స్8 సిరీస్ ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పవచ్చు.

Read Also : JioHotstar Domain : కేంబ్రిడ్జ్ చదువుల కోసం ముందే ‘జియోహాట్‌స్టార్’ డొమైన్ కొనేసిన ఢిల్లీ డెవలపర్.. ఎంత డిమాండ్ చేశాడంటే?