Oppo Find X8 Pro Price
Oppo Find X8 Pro Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్ ప్రస్తుతం ఒప్పో ఫైండ్ X8 ప్రోపై భారీ డీల్స్ అందిస్తోంది. రూ. 13,200 కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రీమియం (Oppo Find X8 Pro Price) ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఒప్పో ఫైండ్ X8 ప్రో టాప్ రేంజ్ కెమెరా సెటప్, పర్మినంటరీ బ్యాటరీ లైఫ్, స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. ఇంతకీ ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసుకుందాం..
అమెజాన్ ఒప్పో ఫైండ్ X8 ప్రో డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ X8 ప్రో రూ.99,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ఈ ప్రీమియం ఫోన్‌పై రూ.10వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ధర రూ.89,999కు తగ్గింది. మీరు HSBC క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.3,250 తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు.
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. డాల్బీ విజన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఫైండ్ X8 ప్రో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP సోనీ IMX858 6x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. హుడ్ కింద, ఒప్పో ఫైండ్ X8 ప్రో మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇంకా, ఈ ప్రీమియం ఫోన్ 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5910mAh బ్యాటరీతో వస్తుంది.