Motorola G45 : బిగ్ ఆఫర్.. అతి చౌకైన ధరకే మోటోరోలా G45 ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Motorola G45 : మోటోరోలా G45పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 10వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Motorola G45
Motorola G45 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త సేల్ మొదలైంది. ఈ సేల్ జూలై 1 నుంచి జూలై 5 వరకు అందుబాటులో (Motorola G45) ఉంటుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో మోటోరోలా G45 5G రూ. 10వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
గత ఏడాది భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయింది. ఈ సేల్ సమయంలో మోటోరోలా 5G ఫోన్ అతి తక్కువ ధరకు లభ్యమవుతోంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలంటే?
మోటోరోలా G45 డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో మోటోరోలా G45 5G ఫోన్ రూ.11,999కి లిస్టు అయింది. ఈ డీల్‌తో పాటు కొనుగోలుదారులు 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్, రూ.11,450 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.
లాంచ్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,999గా ఉంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూ రూ.3వేలు ఉంటే.. రూ.9,999కి పొందవచ్చు. అయితే, కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
మోటోరోలా G45 స్పెసిఫికేషన్లు :
ఫీచర్ల విషయానికి వస్తే.. మోటోరోలా G45 5G ఫోన్ మొత్తం బ్లూ, గ్రీన్, పింక్ లావెండర్, వివా మెజెంటా అనే నాలుగు స్టైలిష్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీని అందిస్తుంది.
ఈ మోటోరోలా 5G ఫోన్ డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 13 కన్నా ఎక్కువ 5G బ్యాండ్‌లు, బ్లూటూత్ వంటి ముఖ్యమైన కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. 5000mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రోజంతా ఛార్జింగ్ వస్తుంది.
కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో డ్యూయల్ లెన్స్, వీడియో కాల్స్ కోసం 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ హలో UIపై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.