RailOne App : ‘రైల్‌వన్’ రిజిస్ట్రేషన్ వెరీ ఈజీ.. కొత్త ఫీచర్లు కిర్రాక్ భయ్యా.. టికెట్ బుకింగ్ నుంచి ఫుడ్ ట్రాకింగ్ వరకు.. ఫుల్ గైడ్..!
RailOne App : ‘రైల్‌వన్’ సూపర్ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. టికెట్ బుకింగ్ నుంచి ఫుడ్ ట్రాకింగ్, ట్రైన్ స్టేటస్ ఒకేచోట యాక్సస్ చేయొచ్చు..

RailOne App
RailOne App : ఇండియన్ రైల్వేస్ కొత్త సూపర్ యాప్ తీసుకొచ్చింది. అదే..’రైల్‌వన్ యాప్’.. రైల్వేశాఖ ఈ యాప్‌లో అన్ని రైల్వే సర్వీసులను ఒకేచోట అందిస్తోంది. ఒక్క మాటలో (RailOne App) చెప్పాలంటే.. రైల్వే సర్వీసులకు సంబంధించి అన్నింటిని సింగిల్ క్లిక్‌తో యాక్సస్ చేయొచ్చు. అన్ని కూడా ఒకే ఇంటర్ ఫేస్ మీదుగా యాక్సస్ చేయొచ్చు.
రిజర్వుడ్ టికెట్ బుకింగ్ దగ్గర నుంచి ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్, ఫుడ్ ఆర్డర్ చేయడం, ఫుడ్ ఆన్ ట్రాక్ వరకు అన్ని ఇట్టే పొందవచ్చు. రైల్‌వన్ యాప్ డౌన్‌లోడ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫీచర్లు, అవేలా పనిచేస్తాయో కూడా భారతీయ రైల్వే శాఖ వివరించింది.
- గూగుల్ ప్లేస్టోర్, iOS యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఆపై యూజర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.
- IRCTC రైల్ కనెక్ట్, UTS అకౌంట్ లాగిన్ వివరాలతో లాగిన్ అవ్వొచ్చు.
- సింగిల్ యూజర్ రిజిస్ట్రేషన్‌తో m-PIN, బయోమెట్రిక్ లాగిన్
- గెస్ట్ లాగిన్ ఆప్షన్ కూడా ఉంది. క్రెడిన్షియల్ లేకుండానే యాప్ యాక్సస్
- ఇందులో అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి
- రైల్‌వన్ యాప్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంది.
- అన్ రిజర్వుడ్, ఫ్లాట్‌ఫాం టికెట్లు 3శాతం తగ్గింపుతో బుకింగ్
రైల్‌వన్ కిర్రాక్ ఫీచర్లు (RailOne App) :
- రిజర్వుడ్ టికెట్ బుకింగ్
- తత్కాల్ టికెట్
- జనరల్ (అన్‌రిజర్వుడ్) టికెట్
- సీజన్ టికెట్
- ప్లాట్‌ఫాం టికెట్
- రైళ్ల సమాచారం
- PNR స్టేటస్
- కోచ్ పొజిషన్
- రైలు ట్రాకింగ్
- ఫుడ్ ఆర్డర్
- ఫైల్ రిఫండ్ సర్వీస్
- ఫిర్యాదులు
- క్విక్ హెల్ప్ కోసం రైల్వే మదత్
- ట్రావెల్ ఫీడ్‌బ్యాక్ సర్వీసులు
- R-వ్యాలెట్‌లో డబ్బులతో బుకింగ్స్
తత్కాల్‌లో కొత్త సేవలివే (RailOne App) :
- తత్కాల్ టికెట్ల బుకింగ్ సిస్టమ్ మారింది.
- జూలై 15 నుంచి ఆధార్ బేస్డ్ OTP అథెంటికేషన్ తప్పనిసరి.
- OTP ఎంటర్ చేస్తేనే తత్కాల్ టికెట్స్ బుకింగ్
- కౌంటర్లు, అథరైజ్డ్ ఏజెంట్లతో బుకింగ్ ఆధార్ బేస్ట్ ఓటీపీ మస్ట్
- మొదటి 30 నిమిషాల్లోపు ఆథరైజ్డ్ ఏజెంట్స్ టికెట్లు బుకింగ్ ఆప్షన్
రిజర్వేషన్ చార్ట్ కొత్త రూల్స్ :
రైల్వే టికెట్లకు సంబంధించి రిజర్వేషన్ల సిస్టమ్ కొత్త రూల్స్ వచ్చాయి. రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ రెడీ అయ్యేది. ఇకపై అలా కాదు.. 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ రెడీ అవుతుంది. వెయిటింగ్ లిస్ట్ విషయంలో ఆందోళన అవసరం ఉండదు. టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదో ముందే తెలిసిపోతుంది.