Oppo Reno 13 5G
Oppo Reno 13 5G : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? లేటెస్ట్ మోడల్ ఒప్పో రెనో 13 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ ఏడాదిలో రూ. 37,999 ప్రారంభ ధరకు లాంచ్ అయిన (Oppo Reno 13 5G) ఈ ఒప్పో ఫోన్ ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ. 30వేల లోపు ధరకు అందుబాటులో ఉంది. తక్కువ ధరలో ఫోన్ కోసం చూస్తుంటే ఒప్పో రెనో 13 5G ఫోన్ అసలు వదులుకోవద్దు. ఒప్పో 5G ఫోన్ అతి తక్కువ ధరకే ఎలా పొందాలి? అన్ని డిస్కౌంట్లు, ఆఫర్లను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఒప్పో రెనో 13 5G ధర :
విజయ్ సేల్స్‌లో ఒప్పో రెనో 13 5G ధర ఫ్లాట్‌గా రూ.8,208 తగ్గింది. తద్వారా కేవలం రూ.29,791కే కొనేసుకోవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కొనుగోలుదారులు రూ.2,500 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ఫైనల్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ మోడల్, డివైజ్ వర్కింగ్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది.
ఒప్పో రెనో 13 5G స్పెసిఫికేషన్లు :
ఒప్పో రెనో 13లో 1.5K రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల డిస్‌ప్లే, 120Hz స్మార్ట్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఉన్నాయి. హుడ్ కింద, ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ (4nm ప్రాసెస్)తో వస్తుంది. 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్ కూడా అందిస్తుంది.
ఈ ఒప్పో ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ColorOS 15పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,600 mAh బ్యాటరీతో వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. IP66, IP68, IP69 సర్టిఫికేషన్ కూడా పొందింది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఒప్పో రెనో 13 5Gలో 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.