Jio Airtel Users : గుడ్ న్యూస్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో యూజర్ల కోసం జియో, ఎయిర్‌టెల్ ఫ్రీ కాలింగ్, డేటా బెనిఫిట్స్..
Jio Airtel Users : వరద ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారుల కోసం జియో, ఎయిర్ టెల్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్, డేటా ఆప్షన్లను కూడా అందిస్తున్నాయి.

Jio Airtel Users
Jio Airtel Users : భారీ వర్షాలు, వరదలు అనేక కుటుంబాలను ప్రభావితం చేశాయి. వరద ప్రాంతంలో చిక్కుకున్న వారు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి అనేక కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తున్నాయి.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు వీలుగా సర్వీసులను అందిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలలోని అన్ని ప్రీపెయిడ్ యూజర్లకు జియో 3 రోజుల వ్యాలిడిటీ ఎక్స్ టెన్షన్ ప్రకటించింది.
వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, 3 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. జియోహోమ్ యూజర్లకు సర్వీసులను అదనంగా 3 రోజుల వరకు ఎక్స్‌టెన్షన్ అందిస్తుంది. జియో పోస్ట్‌పెయిడ్ ఉపయోగిస్తున్న వారికి బిల్లు పేమెంట్లకు 3 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. తద్వారా ఎలాంటి సర్వీసు అంతరాయం లేకుండా కాల్ చేయొచ్చు. ఆపై డేటాను కూడా పొందవచ్చు.
రోజుకు ఫ్రీ కాలింగ్, 1GB డేటా :
భారతీ ఎయిర్‌టెల్ కూడా అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తుంది. వరద ప్రభావిత రాష్ట్రాల్లోని ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1GB హై-స్పీడ్ డేటాతో 3 రోజుల వ్యాలిడిటీ ఎక్స్ టెన్షన్ లభిస్తుంది.
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు కూడా 3 రోజుల గ్రేస్ పీరియడ్‌ను పొందవచ్చు. క్లిష్ట సమయాల్లో అంతరాయం లేని కనెక్టివిటీని పొందవచ్చు. ఈ నెట్ వర్క్ కనెక్టివిటీ కోసం ప్రభుత్వం ఇంట్రా-సర్కిల్ రోమింగ్‌ను ప్రవేశపెట్టింది.
కమ్యూనికేషన్ సపోర్టును మరింత బలోపేతం చేసేందుకు సెప్టెంబర్ 2 (2025) వరకు జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఇంట్రా-సర్కిల్ రోమింగ్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం అన్ని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. వినియోగదారులు తమ సొంత ఆపరేటర్ నెట్‌వర్క్ పనిచేయకపోతే అందుబాటులో ఉన్న ఏదైనా టెలికాం నెట్‌వర్క్‌కు ఆటోమాటిక్ గా స్విచ్ అవ్వొచ్చు.
తీవ్రమైన వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగిపడే సమయంలో కూడా అత్యవసర కాల్స్, అవసరమైన కమ్యూనికేషన్ పొందవచ్చు. జియో, ఎయిర్‌టెల్ ప్రభుత్వం తీసుకున్న ఈ సహాయక చర్యలు విపత్తు ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న లక్షలాది మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్రీ కాలింగ్, ఎక్స్ టెండెడ్ వ్యాలిడిటీ, రోమింగ్ సపోర్టు అందించడం ద్వారా టెలికాం ఆపరేటర్లు బాధిత పౌరులు అత్యవసర సమయాల్లో కుటుంబం, స్నేహితులు, రెస్క్యూ సేవలలో పాల్గొనవచ్చు.