Samsung Galaxy A35 : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ A35పై కిర్రాక్ డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు

Samsung Galaxy A35 : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 ధర తగ్గిందోచ్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy A35 : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ A35పై కిర్రాక్ డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు

Samsung Galaxy A35

Updated On : August 28, 2025 / 2:02 PM IST

Samsung Galaxy A35 : కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ A35 5G ధర భారీగా తగ్గింది. అత్యంత ఆకర్షణీయమైన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇదొకటి. ప్రారంభంలో రూ.32,999 ధరకు లాంచ్ కాగా ఈ శాంసంగ్ ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో రూ.12,300 కన్నా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ఫోన్‌లో ఆకట్టుకునే కెమెరా సిస్టమ్, ప్రీమియం డిజైన్, బ్యాటరీ ఉన్నాయి. రూ. 21వేల లోపు ధరలో ఫోన్ కోసం చూస్తుంటే శాంసంగ్ గెలాక్సీ A35 అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A35 డీల్ :
ఫ్లిప్‌కార్ట్ గెలాక్సీ A35పై రూ. 12,344 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుత ధర రూ. 20,655కి తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అమెజాన్ పే కస్టమర్లు రూ. 619 వరకు అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 18,350 వరకు అదనపు డిస్కౌంట్‌లతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే, మీ ఫోన్ మోడల్, ఎక్స్ఛేంజ్ వర్కింగ్ కండిషన్ బట్టి ఉంటుంది.

Read Also : Google Pixel 8a : ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ అదిరింది.. గూగుల్ పిక్సెల్ 8aపై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి!

శాంసంగ్ గెలాక్సీ A35 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, అడ్రినో 710 జీపీయూతో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15తో 6 జనరేషన్ ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లకు 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ కూడా కలిగి ఉంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A35 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా కూడా ఉంది.